ఒక గంట నిద్ర తగ్గితే దాని భర్తీకి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా..!

మానసిక ఒత్తిడి, పని భారం, విందులు లేదా వినోదాల కారణంగా చాలాసార్లు మనం కంటినిండా నిద్రపోలేకపోతాం. ఇది సాధారణంగా అనిపించినా, కేవలం ఒక గంట నిద్ర తక్కువైనా దాని ప్రభావం శరీరంపై తీవ్రంగా పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Update: 2025-07-16 15:55 GMT

ఒక గంట నిద్ర తగ్గితే దాని భర్తీకి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా..!

మానసిక ఒత్తిడి, పని భారం, విందులు లేదా వినోదాల కారణంగా చాలాసార్లు మనం కంటినిండా నిద్రపోలేకపోతాం. ఇది సాధారణంగా అనిపించినా, కేవలం ఒక గంట నిద్ర తక్కువైనా దాని ప్రభావం శరీరంపై తీవ్రంగా పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆ ఒక గంట నిద్రలోటును భర్తీ చేయడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది.

నిద్ర ఎందుకు అంత ముఖ్యమంటే?

నిద్ర కేవలం అలసటను తగ్గించే సాధనం మాత్రమే కాదు. ఇది మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి వంటి అనేక శారీరక, మానసిక ప్రక్రియలకు అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు మెదడులో రోజంతా పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. కేవలం ఒక గంట నిద్ర తగ్గినా ఈ ప్రక్రియలన్నీ సరిగా జరగక ‘స్లీప్ డెబ్ట్’ (నిద్ర బాకీ) ఏర్పడుతుంది.

నిద్ర బాకీ తీర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది?

ఒక రాత్రి అదనంగా ఎక్కువసేపు నిద్రపోవడం సరిపోదు. మెదడు, శరీర కణాలు సాధారణ స్థితికి రావడానికి మరియు కోల్పోయిన విశ్రాంతి తిరిగి పొందడానికి కొన్ని రోజులు పడుతుంది. అందుకే ఒక గంట నిద్ర తక్కువైతే మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం, చికాకు వంటి సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.

నిద్ర బాకీని తగ్గించుకోవాలంటే?

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం

వారాంతాల్లో కూడా ఈ షెడ్యూల్‌ను పాటించడం

పడకగదిని చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉంచడం

నిద్రకు ముందు ఎలక్ట్రానిక్ పరికరాలు దూరంగా ఉంచడం

మధ్యాహ్నం 20 నిమిషాల పవర్ నాప్ తీసుకోవడం

పగలు ఎక్కువసేపు నిద్రపోవడం, సాయంత్రం కునుకు తీయడం మానుకోవడం

సాయంత్రం వేళల్లో కెఫీన్, ఆల్కహాల్‌ను తగ్గించడం

నిపుణుల సలహా ప్రకారం, రోజుకు ఆరు గంటలకు తగ్గకుండా, ఎనిమిది గంటలకు మించకుండా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. సరైన నిద్ర శరీరానికి, మనసుకు సమతుల్యతను అందిస్తుంది.

Tags:    

Similar News