Women Health: ప్రెగ్నెన్సీ సమయంలో ఇవి 2 చాలా అవసరం.. ఈ సమస్యలకు సరైన పరిష్కారం..!

Women Health: ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది.

Update: 2024-04-13 13:30 GMT

Women Health:ప్రెగ్నెన్సీ సమయంలో ఇవి 2 చాలా అవసరం.. ఈ సమస్యలకు సరైన పరిష్కారం..!

Women Health: ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. కానీ ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చాక చాలా హెల్త్‌ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహిళల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. పుట్టబోయే బిడ్డకోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి, తేనె మిశ్రమం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఉసిరి ఇమ్యూనిటీ బూస్టర్

ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. తల్లి, బిడ్డను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో తోడ్పడుతుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గాయం నయం చేయడంలో సాయపడుతుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మార్నింగ్ సిక్‌నెస్‌లో ఉపశమనం

చాలా మంది మహిళలు గర్భం దాల్చిన మొదటి నెలల్లో మార్నింగ్ సిక్‌నెస్ సమస్యను ఎదుర్కొంటారు. ఉసిరిలో ఉండే పెక్టిన్ మూలకం వికారం, వాంతులు తగ్గించడంలో సాయపడుతుంది. తేనె రుచి వికారాన్ని తగ్గిస్తుంది.

మలబద్ధకం నుంచి బయటపడుతారు

గర్భధారణ సమయంలో మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. ఉసిరిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది సరైన జీర్ణక్రియను మెయింటెన్‌ చేయడానికి మలబద్ధకం తగ్గించడంలో సాయపడుతుంది.

హిమోగ్లోబిన్ స్థాయిని పెంచండి

గర్భిణీలలో ఐరన్ లోపం రక్తహీనతకు కారణమవుతుంది. ఉసిరి ఐరన్‌కు మంచి మూలంగా పరిగణిస్తారు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సాయపడుతుంది. తేనె లోకూడా ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది.

వీటిని గుర్తుంచుకోండి

ఉసిరి, తేనెను తీసుకునే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. మీ గర్భధారణ పరిస్థితిని గమనించి డాక్టర్ మీకు సరైన మోతాదును చెబుతారు.ఉసిరిని ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ సమస్య వస్తుంది. కాబట్టి సమతుల్య పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. మార్కెట్‌ నుంచి తెచ్చిన ప్యాక్‌డ్‌ తేనెకు బదులు సహజసిద్ధమైన తేనెను వాడండి.

Tags:    

Similar News