Health Tips: ఎక్కిళ్లు ఆగడం లేదా.. ఈ చిట్కాలు పాటిస్తే సులువుగా ఆగుతాయి..!

Health Tips: ఎక్కిళ్లు రానివారు దాదాపు అస్సలు ఉండరు. ఎక్కిళ్లు వచ్చినప్పుడు కొంత సమయం వరకు ఇబ్బందిగా ఉంటుంది.

Update: 2022-12-23 10:02 GMT

Health Tips: ఎక్కిళ్లు ఆగడం లేదా.. ఈ చిట్కాలు పాటిస్తే సులువుగా ఆగుతాయి..!

Health Tips: ఎక్కిళ్లు రానివారు దాదాపు అస్సలు ఉండరు. ఎక్కిళ్లు వచ్చినప్పుడు కొంత సమయం వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత నయమైపోతాయి. కానీ ఒక్కసారి ఎక్కిళ్లు వస్తే ఆగడం చాలా కష్టమవుతుంది. ఎక్కిళ్లు సాధారణంగా తక్కువ నీరు తాగినప్పుడు, లేదా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు జరుగుతుంది. వీటి నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలని పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. నీరు తాగడం

ఎక్కిళ్లను ఆపడానికి నీరు తాగడం అనేది చాలాకాలం నుంచి వస్తుంది. మీరు ఈ పరిస్థితికి గురైనప్పుడు ఒక గ్లాసు నీరు నెమ్మదిగా తాగండి. ఇది గొంతుపై అద్భుతంగా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా సమస్య తొలగిపోతుంది.

2. శ్వాసను ఆపడం

తరచుగా ఎక్కిళ్లతో ఇబ్బంది పడుతుంటే నివారించడానికి శ్వాసను ఆపే టెక్నిక్‌ని ఉపయోగించవచ్చు. చేతుల సహాయంతో కొన్ని సెకన్ల పాటు ముక్కు, నోటిని మూసుకోవాలి. తద్వారా ఎక్కిళ్ళు గొంతుకు చేరుకోవడంలో సమస్య ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు ఇది చేయకూడదు.

3. నాలుకను లాగండి

అందరి ముందు నాలుకను బయటకు తీయడానికి కొంత సంకోచించవచ్చు. కానీ ఈ ట్రిక్ నిజంగా ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం మీరు నెమ్మదిగా నాలుకను బయటికి తీసి లాగాలి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్లు ఆగిపోతాయి.

4. ఐస్ వాటర్ తో పుక్కిలించడం

ఎక్కిళ్ళు ఆపడం చాలా కష్టం అవుతుంది. ఈ సందర్భంలో ఐస్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం ఐస్ క్యూబ్‌ను ఒక గ్లాసు నీటిలో వేసి అర నిమిషం పాటు పుక్కిలించాలి. ఎక్కిళ్ళు ఒకేసారి ఆగకపోతే ఈ ప్రక్రియను మళ్లీ మళ్లీ చేయాలి.

Tags:    

Similar News