Happy Hug Day 2025: కౌగిలితో ఆరోగ్యంతో పాటు అనేక ప్రయోజనాలు.. ఇది మీకు తెలుసా!
వాలంటైన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్‌షిప్ డే ఇలా చాలా వింటుంటాం. కానీ హగ్ డే గురించి చాలా మందికి తెలియదు. వాలంటైన్స్ డే వీక్‌లో ప్రతీ రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది.
కౌగిలితో ఆరోగ్యంతో పాటు అనేక ప్రయోజనాలు.. ఇది మీకు తెలుసా!
Happy Hug Day 2025: వాలంటైన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్‌షిప్ డే ఇలా చాలా వింటుంటాం. కానీ హగ్ డే గురించి చాలా మందికి తెలియదు. వాలంటైన్స్ డే వీక్‌లో ప్రతీ రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు హగ్ డేగా జరుపుకుంటారు. కౌగిలితో ఆరోగ్యంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వాలంటేన్ వీక్‌లో భాగంగా హగ్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హగ్ అనేది ప్రేమ, ఓదార్పును ఇస్తుంది. కేవలం శారీరకంగానే కాకుండా బంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. బాధలో ఉన్నప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ఇలా దగ్గరి వారిని కౌగిలించుకుంటే ఆ స్పర్శ.. ఓదార్పుతో పాటు నొప్పి, బాధ, ఆవేశం తగ్గుతాయి. రోజులో దాదాపు 8 నుంచి 12 సార్లు హగ్ చేసుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఒక అధ్యయనం చెబుతోంది. ఒత్తిడి దరిచేరదు, రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా గడిపేస్తారని ఆ సర్వే అభిప్రాయపడింది.
ఇష్టమైన వారిని హగ్ చేసుకుంటే మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇదే విషయం ఓ అధయనంలో తేలింది. దాదాపు 400 మంది పేషంట్లను కొందరిని సన్నిహితులకు దూరంగా, మరికొందరిని దగ్గరగా ఉంచి రోజూ హత్తుకునేలా చేశారు. అయితే రోజూ కౌగిలించుకున్న వారు తొందరగా కోలుకున్నట్టు అధ్యయనంలో తేలిందని స్పష్టం చేశారు. కోపంతో ఉన్నవారిని హత్తుకోవడం వల్ల కోపం తగ్గుతుంది. రక్తపోటు అదుపులోకి వస్తుంది. తద్వారా గుండే సంబంధిత సమస్యలు దరిచేరవు.
దీనికి కారణం హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీన్నే కడల్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా విడుదలైతే ఒత్తిడి తగ్గి దీర్ఘాయుష్ఝు లభిస్తుంది. స్పర్శ ఆందోళనను తగ్గించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భయం, మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు సన్నిహితుల కౌగిలింత ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బాధ, సంతోషం చెప్పలేని సమయంలో సాధారణంగా కౌగిలించుకుంటారు. అవతలి వ్యక్తి పై ఉన్న నమ్మకం, ప్రేమ, ఆప్యాయత కౌగిలింతలోని స్పర్శతో తెలుస్తాయి. దీని వల్ల బాధలో ఉన్న వ్యక్తి ఆ బాధను దూరం చేయడంతో పాటు ప్రశాంతతను కలిగిస్తాయి.
ఈ హగ్గింగ్ సైన్స్ గురించి వింటుంటే.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో బాధలో ఉన్న వారిని చిరంజీవి గట్టిగా హత్తుకుని "జంతర్ మంతర్ ఛూమంత్రకాళీ.. అందర్ కా దర్ద్ దెబ్బకు ఖాళీ" అని డైలాగ్ చెప్పి హత్తుకునే సీన్ గుర్తుకొస్తోంది కదూ!!.