Health Tips: తగినంత నిద్రపోయిన తర్వాత కూడా నీరసంగా అనిపిస్తుందా? అయితే ఇలా చేయండి..!
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెబుతుంటారు.
Health Tips: తగినంత నిద్రపోయిన తర్వాత కూడా నీరసంగా అనిపిస్తుందా? అయితే ఇలా చేయండి..!
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెబుతుంటారు. అలా చేస్తే రోజంతా చురుగ్గా, ఎనర్జిటిక్ గా ఉంటారు. నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, జుట్టు రాలడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. కానీ కొంతమంది తగినంత నిద్రపోయిన తర్వాత కూడా నీరసంగా ఉంటారు. వారికి మంచం మీద నుంచి లేవాలంటే బద్ధకంగా అనిపిస్తుంది. ఇది రోజు వారి పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది.
తగినంత నిద్రపోయిన తర్వాత కూడా నీరసం, సోమరితనం, ఎనర్జీ లేకపోవడం వంటి లక్షణాలు కనిపించడానికి అనేక కారణాలు ఉండవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు పోషకాహార లోపం, డీహైడ్రేషన్, జీర్ణక్రియ సరిగా లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా కూడా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. కానీ దీనిని నివారించడానికి ఆహారంలో కొన్ని ప్రత్యేక ఆహారాలను చేర్చుకుంటే ఎనర్జిటిక్ గా ఉంటారని చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లు తాగండి
మీకు రోజంతా నీరసంగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగండి. కొబ్బరి నీళ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు, ఎలక్ట్రోలైట్ల లోపాన్ని కూడా తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లతో పాటు పెరుగుతో చేసిన మజ్జిగ కూడా తాగవచ్చు. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.
ఉసిరి కాయ
ఉసిరి కాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఇది జీవక్రియను కూడా చక్కగా ఉంచుతుంది. మీకు శక్తి తక్కువగా అనిపిస్తే, మీరు రోజూ ఉసిరికాయ రసం తాగవచ్చు. దీని వల్ల శరీరం త్వరగా అలసిపోదు.
బాదం, ఎండుద్రాక్ష తినండి
బాదం, ఎండుద్రాక్షలను అత్యంత శక్తివంతమైన డ్రై ఫ్రూట్స్‌గా పరిగణిస్తారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని రాత్రంతా నానబెట్టి తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు శరీరంలోకి బాగా శోషణకు గురవుతాయి. దీనివల్ల శరీరంలో పోషకాహార లోపం ఉండదు. శరీరంలో ఎనర్జీ లెవల్ కూడా పెరుగుతుంది.
ఖర్జూరాలను పాలతో తినండి
ఖర్జూరాలు సహజ శక్తిని పెంచుతాయి. పాలతో కలిపి తింటే బద్ధకం సమస్య ఉండదు. పాలలో కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా చేస్తాయి. రాత్రి పడుకునే గంట ముందు పాలతో ఖర్జూరం తినాలి. ఇది బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. అలసిపోకుండా ఉంటారు.