Room Heater : చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? అయితే మీకు మూడినట్లే
చలికాలంలో గదిని వెచ్చగా ఉంచడానికి చాలామంది హీటర్ ఆన్ చేసి నిద్రపోతుంటారు. ఈ పద్ధతి తక్షణమే వేడిని ఇచ్చినా, గదిలోని తేమ తగ్గిపోయి గాలి పొడిగా మారుతుంది.
Room Heater : చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? అయితే మీకు మూడినట్లే
Room Heater : చలికాలంలో గదిని వెచ్చగా ఉంచడానికి చాలామంది హీటర్ ఆన్ చేసి నిద్రపోతుంటారు. ఈ పద్ధతి తక్షణమే వేడిని ఇచ్చినా, గదిలోని తేమ తగ్గిపోయి గాలి పొడిగా మారుతుంది. ఈ పొడి గాలి మన శరీరంలో అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. దీని వల్ల గొంతు నొప్పి, చర్మం పొడిబారడం, కళ్లలో మంట, చికాకు వంటి సమస్యలు వస్తాయి.
హీటర్ నుంచి వచ్చే నిరంతర వేడి, పొడి గాలి నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల మొదట్లో జలుబు లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఉదయం లేవగానే గొంతు పొడిబారడం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతిలో బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరికి రాత్రి సమయంలో పదేపదే దగ్గు వచ్చే సమస్య ఎదురుకావచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎవరికైతే ఇప్పటికే ఆస్తమా, బ్రాంకైటిస్ లేదా అలర్జీ వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నాయో, వారు రాత్రంతా హీటర్ వేసి పడుకోవడం వల్ల ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
హీటర్ వాడేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
హీటర్‌ను ఉపయోగించినప్పుడు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పక పాటించాలి.
* గాలి సరఫరా : గదిలో తగినంత గాలి సరఫరా (లైట్ వెంటిలేషన్) ఉండేలా చూసుకోవాలి. పూర్తిగా గదిని మూసివేయకూడదు.
* తేమ కోసం: గదిలో తేమ శాతం తగ్గకుండా ఉండటానికి, హీటర్‌కు దగ్గరగా ఒక బకెట్ నిండా నీళ్లు లేదా వెచ్చని నీళ్లు ఉంచాలి. ఇది గది గాలిలో తేమను పెంచుతుంది.
* నిరంతర వాడకం వద్దు: రాత్రంతా హీటర్‌ను ఆన్ చేసి ఉంచకూడదు. అవసరాన్ని బట్టి కొంత సమయం వాడి, ఆపై ఆపివేయాలి.
* దూరం పాటించండి: ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు హీటర్‌కు చాలా దగ్గరగా కూర్చోకుండా చూసుకోవాలి.