Sleep Deprivation : జాగ్రత్త..6 గంటల కంటే తక్కువ నిద్ర పోతున్నారా? నిద్ర తక్కువైతే నరకమే!

ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యం. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం చక్కగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవడం చాలా అవసరం.

Update: 2025-12-08 08:30 GMT

Sleep Deprivation : జాగ్రత్త..6 గంటల కంటే తక్కువ నిద్ర పోతున్నారా? నిద్ర తక్కువైతే నరకమే!

Sleep Deprivation : ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యం. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం చక్కగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవడం చాలా అవసరం. కానీ నేటి రోజుల్లో చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్ర పట్టడం లేదని చెబుతుంటారు. ఇలా రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్ర పోతే ఎలాంటి సమస్యలు వస్తాయో కింద వివరంగా తెలుసుకుందాం.

మీరు ప్రతిరోజూ తగినంత నిద్ర పొందకపోతే, దాని ప్రభావం నేరుగా మీ మెదడు పనితీరుపై కనిపిస్తుంది. తక్కువ నిద్ర కారణంగా మెదడు సరిగ్గా పనిచేయదు, దీంతో మీరు ఏకాగ్రత కోల్పోతారు. కనీసం 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. సరైన నిద్ర లేకపోవడం వలన తక్షణమే మెదడుపై ప్రభావం పడుతుంది. ఇది జ్ఞాపకశక్తిని కోల్పోవడానికి దారితీయవచ్చు. ఒక రాత్రి సరిగా నిద్ర లేకపోయినా కూడా దృష్టి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

నిద్ర లేమి అనేది కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు, శారీరక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్ర లేమి ప్రధానంగా హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని కలిగించే హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల ఆందోళన, చిరాకు, రక్తపోటు, ఆకలిపై ప్రభావం పడుతుంది. రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే, శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కాలక్రమేణా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

తక్కువ నిద్ర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీని ఫలితంగా తరచుగా ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు మీపై దాడి చేస్తాయి. నిద్ర లేమి చర్మ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చర్మంపై ముడతలు, డార్క్ సర్కిల్స్ కనిపించడానికి ఇది కారణమవుతుంది. రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల భవిష్యత్తులో అనేక దీర్ఘకాలిక, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె సంబంధిత సమస్యలు, పక్షవాతం, ఊబకాయం, మధుమేహం, డిప్రెషన్, ఒత్తిడి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి నిద్ర లేమి ఒక ప్రధాన కారణంగా మారుతుంది.

Tags:    

Similar News