ఊబకాయంతో బాధపడేవారు వీటిని తీసుకుంటే మంచిది

వంగ, వంకాయ విరివిగా లభించే కూరగాయల్లో ఒకటి ఇది. ఉదారంగు, తెలుపు, పసుపు, గులాబీ రంగుల్లో ఉండే రకరకాల ఆకృతుల్లో లభించే ఈ వంకాయలంటే భోజన ప్రియులకు ఎంతో ఇష్టం...వంకాయలను ఎలా వండుకున్నా రుచిగానే ఉంటాయి.

Update: 2020-03-09 10:31 GMT

వంగ, వంకాయ విరివిగా లభించే కూరగాయల్లో ఒకటి ఇది. ఉదారంగు, తెలుపు, పసుపు, గులాబీ రంగుల్లో ఉండే రకరకాల ఆకృతుల్లో లభించే ఈ వంకాయలంటే భోజన ప్రియులకు ఎంతో ఇష్టం...వంకాయలను ఎలా వండుకున్నా రుచిగానే ఉంటాయి...రుచిలోనే కాదు...పోషకాల్లోనూ వంకాయలు భేష్ అనిపిస్తాయి...తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు కలిగిన ఈ వంకాయలు నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య రుగ్మతుల నుంచి బయటపడవచ్చు. వంకాయల్లో ఔషధ విలువలూ అనేకమే. ఇది పేదవారి పోషకాల ఆహారంగా ఆరోగ్య నిపుణులు సంభోదిస్తుంటారు.

వంగలో పిండి పదార్ధాలు తక్కువగా పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి...బి1,బి6 వంటి మిటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం ,కాపర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. వంకాయల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది..కాబట్టి ఊబకాయంతో బాధపడేవారు వీటిని తీసుకుంటూ ఉండాలి...ఇది బరువును నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం సమస్య ఉన్నవారు వంకాయ ను, టమోటతో కలిపి వండుకుని తించే మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణ సమస్యలు తీరు ఆకలి వేస్తుంది. వంకాయ తింటే గ్యాసు, ఎసిడిటీ, కఫము తగ్గుతాయి..అందుకోసం వంకాయలను బాగా రోస్ట్ చేసి తొక్క తీసేసి ఉప్పుతో కలిపి తింటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. నిద్ర లేమితో బాధపడేవారికి ఇది చక్కటి ఇంటి వైద్యం కూడా. వంకాల్లో పీచుపదార్ధాలు అధికంగా ఉండటం వల్ల షుగర్ పేషంట్స్ ఎంచక్కా లాగించేయవచ్చు. వంకాయల్లో ఉండే పోలిఫినాల్స్ రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. బిపి ని కూడా ఇది నియంత్రిస్తుంది. మెదడు కణాల చుట్టూ ఉండే అవసరమైన కొవ్వులను కాపాడటంలో వంకాయలు సహాయపడతాయి.

కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఫిట్స్ తగ్గేందుకు వంకాయలను వినియోగిస్తారట. వంకాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి...వీటిని తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి..ప్రధానంగా కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నా...పుండ్లు ఏర్పడినా వంకాయలను తినకూడదు. ముఖ్యంగా గర్భినీ స్త్రీలు వంకాయలకు దూరంగా ఉండాలి...ఎందుకంటే వంకాయలు తినడం వల్ల స్కిన్‌ ఎలర్జీలు వచ్చే ప్రదామం ఉంది..వంకాయ పడని వారు తినడం వల్ల దురదలు, ఎలర్జీలు వస్తుంటాయి. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు వంకాయలకు దూరంగా ఉంటేనే మంచిది.

Tags:    

Similar News