సోయా బీన్‌తో ఆరోగ్య ధీమా

సోయాబీన్ ఇది అధిక పోషక విలువలు కలిగిన ఆహారం. బఠానీ జాతికి చెందిన సోయాలో అధికమొత్తంలో ప్రోటీన్లు, కాల్షియం , ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు ఎ, బి1, బి2, బి3, బి9 వంటి విటమన్ల స్థాయి అధికంగా ఉంటుంది.

Update: 2020-03-15 06:53 GMT
Soya Bean

సోయాబీన్ ఇది అధిక పోషక విలువలు కలిగిన ఆహారం. బఠానీ జాతికి చెందిన సోయాలో అధికమొత్తంలో ప్రోటీన్లు, కాల్షియం , ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు ఎ, బి1, బి2, బి3, బి9 వంటి విటమన్ల స్థాయి అధికంగా ఉంటుంది.ఇందులో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వెజిటేరియన్స్‌కి ఈ సోయా బీన్ చక్కటి పోషకాల ఆహారం . వీటిని తరచుగా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోయాబీన్‌లో ఉండే సూక్ష్మ పోషక పదార్ధాలు బరువును తగ్గించేందుకు దోహదపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా కండరాల బరువుకు సహాయపడుతుందట. ఇది సైటిఫికల్లీ కూడా నిరూపితమైంది. క్రమం తప్పకుండా సోయాబీన్ తీసుకోవడం వల్ల శరీరంలో హానికారక క్రొవ్వు స్థాయిలు తగ్గి శరీర బరువు తగ్గుతుంది. అదే విధంగా కాలేయంలో పెరిగిన కొవ్వును కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది.

సాధారణంగా 30ఏళ్లుపైబడిని స్త్రీలలో ప్రధానంగా ఎముకల అరుగుదల కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తరుచుగా వస్తుంటాయి..వీటి వల్ల మహిళలు ఎంతగానో ఇబ్బందులు పడుతుంటారు..అలాంటి వారు సోయాబీన్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇవి ఎముకలను బలపరిచేందుకు ఎంతగానో సహాయపడతాయట.ప్రధానంగా రుతుశ్రవం ఆగిపోయిన మహిళల్లో ఎముకల బలం పెరగడానికి ప్రత్యేకంగా ప్రభావం చూపిస్తుంది. మధుమేహం నియంత్రణకు సోయాలు చక్కగా ఉపయోగపడతాయిన నిపుణుల మాట .

రక్త హీనతగా అనేక కారణాలు ఉంటాయి.ప్రధానంగా శరీరంలో ఐరన్ లెవల్స్ తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఈ క్రమంలో సోయాలను తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య వృద్ధి చెంది రక్తహీనత తొలగిపోతుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహ సమస్యల వల్ల గుడ్డె సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాలన్‌ను నియంత్రించడం వ్లల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..అందుకోసం సోయా చక్కటి పరిష్కార మార్గంఅంటున్నారు. సోయాలోని అధిక ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. నిద్ర సమస్యతో బాధపడేవారు కూడా సోయాబన్స్‌ను తినేందుకు ఆసక్తి చూపించాలి. వీటిని తీసుకోవడం వల్ల నిద్ర సమస్య ఉండదు. అత్యంత భయంకరమైన ‌క్యాన్సర్ నివారణకు సోయా ఎంతగానో సహాపడుతుంది.

 

Tags:    

Similar News