Hair Care: ఇలా చేస్తే జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
Hair Care: హెయిర్ ఫాల్, చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలన్నీ తగ్గించే డీటాక్స్ టెక్నిక్ ఇదే.
Hair Care: ఇలా చేస్తే జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
ప్రస్తుత కాలంలో పొల్యూషన్, పోషకాహార లోపం, జీవితశైలి లోపాల వల్ల చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్, చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే నిపుణుల చెబుతున్న ఒక సాధారణ టెక్నిక్ పాటిస్తే అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు.
జుట్టు ఆరోగ్యానికి డీటాక్స్ కీలకం
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే స్కాల్ప్ శుభ్రంగా ఉండాలి. అందుకే జుట్టుని అప్పుడప్పుడు డీటాక్స్ చేయడం అత్యవసరం. నిపుణుల సూచన మేరకు, డీటాక్స్ ప్రారంభానికి ముందు జుట్టు కత్తిరించి తక్కువ పొడవుగా ఉంచాలి. షాంపూలు, కెమికల్ క్రీములను పూర్తిగా మానేసి సహజ మార్గాల్లో జుట్టు పెరగనివ్వాలి. ప్రతిరోజూ కొబ్బరి నూనెను తలకు రాసి, రెండు రోజులకోసారి కుంకుడుగాయలతో తలస్నానం చేయాలి.
స్కాల్ప్ ప్యాక్స్‌తో మెరుగైన ఫలితం
డీటాక్స్ సమయంలో స్కాల్ప్‌కి కొన్ని సహజ ప్యాక్స్‌ను అప్లై చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మందార ఆకుల పేస్ట్, లేదా పెరుగు-తేనే మిశ్రమం, లేదా నిమ్మరసం-తేనే కలిపిన పేస్ట్‌లను తలకు పెట్టి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే స్కాల్ప్‌లో పేరుకున్న జిడ్డు, ధూళి తొలగిపోతాయి. ఫలితంగా హెయిర్ ఫాలికల్స్ శక్తివంతమవుతాయి.
మూడునెలలకోసారి చేయడం ఉత్తమం
ఈ హెయిర్ డీటాక్స్‌ను మూడునెలలకోసారి చేయడం ఉత్తమం. ఇలా రెండు లేదా మూడు సార్లు చేసిన తర్వాత స్కాల్ప్ పూర్తిగా ఆరోగ్యంగా తయారవుతుంది. అప్పటినుంచి జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కనిపించవు. ఆ తర్వాత మన ఇష్టానుసారంగా జుట్టు పెంచుకోవచ్చు.
నీళ్లు, పోషకాహారం కూడా కీలకం
జుట్టు ఆరోగ్యానికి బయట చూసుకోవడమే కాకుండా లోపలి శ్రద్ధ కూడా అవసరం. రోజుకు కనీసం 4 లీటర్ల నీటిని తాగాలి. కూరగాయలు, పండ్లు, నట్స్ తినడం వల్ల జుట్టుకి అవసరమైన పోషకాలు అందుతాయి. డీటాక్స్ సమయంలో బయటికి వెళ్లేటప్పుడు తలపై స్కార్ఫ్ ధరించడం, ధూళి తగలకుండా జాగ్రత్త పడటం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.