Hair Care Tips: మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించండి..!
Hair Care Tips: జుట్టు అందాన్ని పెంచుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు.
Hair Care Tips: మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించండి..!
Hair Care Tips: జుట్టు అందాన్ని పెంచుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది చిన్న వయసులోనే చాలా మందిని వేధించే పెద్ద సమస్య. ప్రస్తుతం స్త్రీ, పురుషులిద్దరిలోనూ జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. వేసవిలో వేడి కారణంగా ఇది పెరుగుతుంది. అయితే, ఇంట్లోని ఈ వస్తువుల ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ, మందార పువ్వులు, వేప ఆకులతో తయారు చేసిన హెయిర్ ప్యాక్‌ని ఉపయోగించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చని అంటున్నారు.
హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
10 మందార పువ్వులు
20 నుండి 25 మందార పువ్వు ఆకులు
రెండు గుప్పెళ్ల వేప ఆకులు
ఫస్ట్ చిట్కా
మందార పువ్వులు, వేప ఆకులను రెండు రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. తరువాత దాన్ని పొడిగా చేసి పెట్టుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు ఈ పొడిని నీటిలో వేసుకోని తలస్నానం చేస్తే మంచిది.
సెకండ్ చిట్కా
పావు లీటరు నీటిలో 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి 10 నిమిషాలు బాగా మరిగించాలి. ఇప్పుడు మీరు దానిని ఫిల్టర్ చేసి తలకు పట్టించుకోండి. 10 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్, బియ్యం పిండి రెండింటిని కలిపి హెయిర్ ప్యాక్ చేసుకోండి. వీటిని తలకు బాగా అప్లై చేయండి. మీ తల చివర్ల నుండి వేర్ల వరకు 10 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత షాంపూ ఉపయోగించకుండా మీ జుట్టును కడగండి. ఈ హెయిర్ ప్యాక్ ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.