Hair Care Tips: తలస్నానం చేసిన వెంటనే ఈ పనులు చేయకండి

Hair care Tips: జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే, తలస్నానం చేస్తే సరిపోదు. జుట్టును సరిగ్గా చూసుకోవడం కూడా ముఖ్యం. కానీ తలస్నానం చేసిన తర్వాత చాలా మంది కొన్ని సాధారణ తప్పులు చేస్తారు.

Update: 2025-06-19 06:00 GMT

Hair care Tips: తలస్నానం చేసిన వెంటనే ఈ పనులు చేయకండి

Hair care Tips: జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే, తలస్నానం చేస్తే సరిపోదు. జుట్టును సరిగ్గా చూసుకోవడం కూడా ముఖ్యం. కానీ తలస్నానం చేసిన తర్వాత చాలా మంది కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. అయితే, వీటిని నివారించాలి. ఎందుకంటే, క్రమంగా జుట్టు మూలాలు దెబ్బతీంటాయని, జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పల్చబడటం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి, తలస్నానం తర్వాత చేయకూడని కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం..

తడి జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం

తలస్నానం తర్వాత, ప్రజలు తరచుగా తమ జుట్టును టవల్ తో గట్టిగా రుద్దుతారు. తద్వారా అది త్వరగా ఆరిపోతుంది. కానీ ఈ అలవాటు జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే, తడి జుట్టు బలహీనమైనది, దానిని గట్టిగా రుద్దడం వల్ల అది విరిగిపోతుంది. అటువంటి పరిస్థితిలో మైక్రోఫైబర్ టవల్ లేదా మృదువైన కాటన్ టీ-షర్టుతో మీ జుట్టును సున్నితంగా రుద్దండి.

తడి జుట్టును దువ్వడం

తలస్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వడం మంచిది కాదు. ఎందుకంటే జుట్టు విరిగిపోతుంది. అంతేకాకుండా, జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వితే అది చిక్కుబడుతుంది. జుట్టు వేర్లు కూడా బలహీనంగా ఉంటాయి. కాబట్టి, పొరపాటున కూడా తడి జుట్టును దువ్వకండి. బదులుగా జుట్టును కొద్దిగా ఆరనివ్వండి, ఆపై వెడల్పు దంతాల దువ్వెనతో దువ్వండి.

హెయిర్ డ్రైయర్ ఉపయోగించడం

కొంతమంది తలస్నానం వెంటనే హెయిర్ డ్రైయర్ లేదా స్ట్రెయిట్నర్ వాడటం ప్రారంభిస్తారు. అయితే, ఇలా చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. హెయిర్ డ్రైయర్‌ను అతిగా వాడితే జుట్టుకు హాని కలుగవచ్చు. అధిక వేడి జుట్టులోని తేమను తొలగిస్తుంది.. ఇది జుట్టును పొడిబారడానికి, చిట్లడానికి దారితీస్తుంది.

టైట్ హెయిర్ స్టైల్స్

తరచుగా కొంతమంది మహిళలు తడి జుట్టు మీద పోనీటైల్ వంటి హెయిర్ స్టైల్స్ వేసుకుంటారు. ఇది జుట్టు మూలాలను ఎక్కువగా దెబ్బతీస్తుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు టైట్‌గా హెయిర్ స్టైల్స్ వేసుకుంటే జుట్టు మూలాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల జుట్టు విరిగిపోతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం పెరుగుతుంది. అందువల్ల, జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకోండి.

Tags:    

Similar News