Green Peas Benefits : బరువు తగ్గాలా? ఇక రైస్ బదులు వీటిని తినండి..పొట్ట నిండా, కానీ కొవ్వు సున్నా!

చలికాలంలో మార్కెట్‌లో రకరకాల కూరగాయలు లభిస్తాయి. వాటిలో పచ్చి బఠాణీలు ఒకటి. ఇవి చాలా సులభంగా దొరికే సూపర్‌ఫుడ్ గా పరిగణించబడతాయి.

Update: 2025-12-16 06:00 GMT

Green Peas Benefits : బరువు తగ్గాలా? ఇక రైస్ బదులు వీటిని తినండి..పొట్ట నిండా, కానీ కొవ్వు సున్నా!

Green Peas Benefits : చలికాలంలో మార్కెట్‌లో రకరకాల కూరగాయలు లభిస్తాయి. వాటిలో పచ్చి బఠాణీలు ఒకటి. ఇవి చాలా సులభంగా దొరికే సూపర్‌ఫుడ్ గా పరిగణించబడతాయి. ఎందుకంటే వీటిలో ప్రొటీన్, ఫైబర్, అనేక రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం, పచ్చి బఠాణీలను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు ఇవి సహాయపడతాయి. కాబట్టి చలికాలంలో పచ్చి బఠాణీలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఏ సమస్యలకు ఇవి రామబాణంగా పనిచేస్తాయి అనే వివరాలను తెలుసుకుందాం.

బఠాణీలు ఎందుకు తినాలి?

పచ్చి బఠాణీలలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి కీలక పోషకాలు ఉన్నాయి. వీటితో పాటు బఠాణీలలో తగినంత మొత్తంలో ప్రొటీన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ప్రొటీన్ లోపాన్ని తీర్చుకోవడానికి బఠాణీలు చాలా మంచివి. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల ప్రతిరోజూ బఠాణీలు తీసుకోవడం ద్వారా ప్రొటీన్ కొరతను అధిగమించవచ్చు.

ఏ వ్యాధులకు ఎలా ప్రయోజనకరం?

పచ్చి బఠాణీలు వివిధ ఆరోగ్య సమస్యలకు ఎలా మేలు చేస్తాయో చూద్దాం

గుండె ఆరోగ్యానికి ఉత్తమం: పచ్చి బఠాణీలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఫైబర్‌ను కూడా అందిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.

ఎముకల బలహీనతను నివారిస్తుంది: బఠాణీలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా ఇవి నివారిస్తాయి.

జీర్ణ వ్యవస్థకు మేలు: బఠాణీలలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. ప్రతిరోజూ బఠాణీలు తినడం ద్వారా కడుపుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు తగ్గుతాయి.

బరువు తగ్గడానికి సహాయకారి: బఠాణీలు ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా కలిగి ఉండటం వల్ల ఆకలిని నియంత్రించడానికి సహాయపడతాయి. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. దీని వల్ల అతిగా తినే అలవాటు తగ్గి, బరువు అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

బఠాణీలు ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే కొన్ని నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఎలాంటి కొత్త ఆహారాన్ని ప్రయత్నించే ముందు తప్పకుండా ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Tags:    

Similar News