Green Or Red Apple: గ్రీన్ ఆర్ రెడ్.. ఏ ఆపిల్ శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది?

Green Or Red Apple: ఆపిల్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వాటిని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు ఎప్పుడు చెబుతారు.

Update: 2025-05-15 02:30 GMT

Green Or Red Apple: గ్రీన్ ఆర్ రెడ్.. ఏ ఆపిల్ శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది?

Green Or Red Apple: ఆపిల్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వాటిని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు ఎప్పుడు చెబుతారు. మార్కెట్‌లో రెండు రకాల ఆపిల్లు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ కలర్, రెడ్ కలర్. రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. అయితే, గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఆపిల్ మధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రీన్ ఆర్ రెడ్ ఆపిల్.. ఏది మంచిది ?

*రెడ్ ఆపిల్ కంటే గ్రీన్ ఆపిల్‌లో చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగంగా ఉంటాయ

*గ్రీన్ కలర్ ఆపిల్‌లో జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో, రెడ్ ఆపిల్స్‌లో ఫైబర్‌తో పాటు ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.

*గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎర్రటి ఆపిల్స్‌లో ఉండే క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

* రెడ్, గ్రీన్ ఆపిల్స్ రెండూ కూడా శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రయోజనంగా ఉంటాయి. ఇది మాత్రమే కాదు, ప్రతి ఉదయం ఒక ఆపిల్ తినడం ద్వారా మీరు కాలేయ వ్యాధిని కూడా నివారించవచ్చు.

* మీరు బరువు తగ్గాలనుకుంటే, డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే తక్కువ గ్రీన్ ఆపిల్ మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

* గుండె లేదా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే తియ్యగా ఉండే రెడ్ ఆపిల్ మంచిగా ఉంటుంది.

Tags:    

Similar News