Girls & Depression: అమ్మాయిలు & డిప్రెషన్ ఎందుకు ఎక్కువగా బాధపడుతుంటారు?
Girls & Depression: అమ్మాయిలు & డిప్రెషన్ ఎందుకు ఎక్కువగా బాధపడుతుంటారు?
అందంగా కనిపించే ప్రతి అమ్మాయిలు లోపలా ఒక ప్రత్యేకమైన పోరాటం జరుపుకుంటుంటారు. బయట నవ్వుతూ సంతోషంగా కనిపించినా, లోపల వారు ఆందోళన, ఒత్తిడి, భయం, అనిశ్చితితో భరితంగా ఉంటారు. ఈ భావోద్వేగ మార్పుల వెనుక ప్రధాన కారణం శరీరంలో హార్మోన్ల అసమతుల్యత. ఇది ఏదైనా “నాటకీయత” కాదు, నిజమైన బయోలాజికల్ రియాలిటీ.
అమ్మాయిలు చిన్న విషయాలకే ఎందుకు ఎక్కువగా బాధపడతారు? ఎందుకు వారిలో మూడ్ తరచుగా మారుతుందో? నిపుణులు చెబుతున్నది – ఇది శరీర, మానసిక మార్పుల కలయిక వల్లే. హార్మోన్ల అసమతుల్యత, జీవిత ఒత్తిడులు కలిసినప్పుడు మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుంది.
సెల్ఫ్ కేర్ ముఖ్యమే:
ప్రతిరోజూ వ్యాయామం లేదా యోగా చేయడం
పౌష్టికాహారాన్ని తీసుకోవడం
సరియైన నిద్ర (7-8 గంటలు)
ఆత్మబలం కోసం ధ్యానం, మైండ్‌ఫుల్ నెస్
అవసరమైతే నిపుణుడిని కలవడం
సాధారణంగా అనిపించే డిప్రెషన్ దీర్ఘకాలంగా కొనసాగితే, ఇది మానసిక వ్యాధులకూ దారి తేలవచ్చు. అందుకే అమ్మాయిలలో మార్పులు గమనించినప్పుడు, “మంచిగా ఉండాలి” అని చెబుతుండడం కన్నా, “ఏమైంది?” అని ఒక స్నేహితుడిలా అడగడం అత్యంత అవసరం. సమాజం, కుటుంబం ప్రతి చోట ఒత్తిడిని కలిగిస్తూనే ఉంటాయి. ఆడవాళ్లకు ఓదార్పు, మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం.