Ghost In Dreams: నిద్రలో మీకు దెయ్యాలు ఎక్కువగా వస్తున్నాయా?
Ghost In Dreams: నిద్రలో కలలు రావడం సహజం. కానీ.. కొంతమందికి భయంకరమైన పీడ కలలు వస్తుంటాయి. దీంతో నిద్రలోనే ఉలిక్కి పడి లేస్తూ ఉంటారు.
Ghost In Dreams: నిద్రలో మీకు దెయ్యాలు ఎక్కువగా వస్తున్నాయా?
Ghost In Dreams: నిద్రలో కలలు రావడం సహజం. కానీ.. కొంతమందికి భయంకరమైన పీడ కలలు వస్తుంటాయి. దీంతో నిద్రలోనే ఉలిక్కి పడి లేస్తూ ఉంటారు. అయితే ఈ కలల ప్రభావం మెదడుపైన మాత్రమే కాదు ఆరోగ్యం పైన కూడా పడుతుంది. ఒక్కో కల ఒక్కో విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే పీడకలలు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజంతా అలసిపోయి.. బాగా ఆలోచించి.. బాబా పనిచేసి రాత్రి విశ్రాంతి తీసుకుంటుంది.. శరీరం. అప్పుడు కొంతమంది డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోతారు. అయితే మరికొందరు ఏవో ఆలోచిస్తూ పడుకుంటారు. ఇలాంటి వాళ్లకే వింత వింత కలలు వస్తాయి. ఒక్కోసారి పీడకలలు కూడా వస్తుంటాయి. అయితే పీడ కలలు రావడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి.
ఒకవేళ మీ కలలో తరచూ దెయ్యాలు వస్తున్నాయంటే.. మీరు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నారని అర్దం. అంతేకాదు రేపు ఏమవుతుందోనన్న భయంతో టెన్షన్‌తో పడుకునేవారికి కలలో దెయ్యాలు వస్తాయట. ఇక్కడ దెయ్యాలు అంటే ఒక వింత ఆకారం. ఒక భయంకరమైన ఆకారం. ఇవే తరచూ నిద్రలో వస్తుంటాయి.
పీడకలలు వస్తున్నాయన్నా.. కలలో దెయ్యాలు ఎక్కువగా కనిపిస్తుయన్నా దానికి సంకేతం మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్ధం. ఎప్పుడైతే మీరు చెడుగా ఆలోచించినా, భయపడుతున్నా ఇక రాత్రిళ్లు దెయ్యాలు మీకు కలలో వస్తాయి.
మానసికంగా బలంగా లేకపోయినా కూడా దెయ్యాలు కలలోకి వస్తుంటాయి. కొందరు ప్రతి విషయానికి ఎక్కువ ఎమోషన్ అయిపోతుంటారు. అలాగే కొందరు జీవితంలో బాగా నచ్చింది కోల్పోయినప్పుడు బాధలో ఉంటారు.. మరికొంతమంది ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు.. ఇలాంటి వాళ్లకు కూడా దెయ్యాలు కలలో వస్తుంటాయి.
దెయ్యంతో పోరాడుతున్నట్టు కలలు వస్తే మీరు మానసికంగా చాలా వీక్ అయిపోతున్నారని అర్ధం. మీలో మేరే తెలియకుండా ఏదో యుద్ధం చేస్తున్నారని అర్ధం. అందుకే వెంటనే సైకాలజీ డాక్టర్లను కలిసి మీరు ఆలోచిస్తున్న విషయాల గురించి చెప్పాలి.
ఇక చిన్నపిల్లలో ఇలాంటి కలలు వస్తుంటే వారికి మానసికంగా బలాన్ని ఇవ్వాలి. అంతేగానీ మూడనమ్మకాలు వారికి చెప్పకూడదు. మొత్తంగా చెప్పేది ఏంటంటే.. ఆలోచనా విధానం బట్టే కలలు వస్తాయి.