Garlic Health Benefits: చలికాలంలో వెల్లుల్లిని తప్పక వాడాలి.. దీని మాదిరి ఏ ట్యాబ్లెట్‌ పనిచేయదు..!

Garlic Health Benefits: చలికాలం సీజనల్‌ వ్యాధులను మోసుకొస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతునొప్పితో చాలా మంది బాధపడుతారు.

Update: 2024-01-26 15:00 GMT

Garlic Health Benefits: చలికాలంలో వెల్లుల్లిని తప్పక వాడాలి.. దీని మాదిరి ఏ ట్యాబ్లెట్‌ పనిచేయదు..!

Garlic Health Benefits: చలికాలం సీజనల్‌ వ్యాధులను మోసుకొస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతునొప్పితో చాలా మంది బాధపడుతారు. పిల్లలు, వృద్దులు తొందరగా జబ్బు పడుతారు. ఇటువంటి పరిస్థితిలో డైట్‌లో కొన్ని ఆయుర్వేద ఆహారాలను చేర్చుకోవాలి. వంటింట్లో ఉండే కొన్ని రకాల మసాలాలు చాలా వ్యాధులను నయం చేస్తాయి. అందులో ఒకటి వెల్లుల్లి. ఇది ఆహారపు రుచిని పెంచే ఒక మసాలా మాత్రమే కాదు ఔషధ గుణాల నిధి కూడా. శీతాకాలంలో వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో వైరస్‌లు, బాక్టీరియా దాడి ఎక్కువగా ఉన్నప్పుడు వెల్లుల్లిలోని ఈ ప్రత్యేకత శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లిని సంప్రదాయకంగా దగ్గు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. చలికాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల కంట్రోల్‌లో ఉంటుంది.

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుంది. ఇది శీతాకాలంలో పెరిగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి జీర్ణక్రియ ప్రక్రియను సాఫీగా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా శీతాకాలంలో జీర్ణ సమస్యలు సాధారణం అవుతాయి.ఈ పరిస్థితిలో పచ్చి వెల్లుల్లి తినడం చాలా ప్రయోజనకరం. దీన్ని కూరగాయలలో చేర్చి సూప్‌లో జోడించి, చట్నీ తయారు చేసి కూడా తినవచ్చు. అయితే ఏదైనా పరిమితమే అని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News