Health Tips: ఈ గింజలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే ఈ వ్యాధులు నయం..!

Health Tips: ఉదయాన్నే 4 రకాల నానబెట్టిన గింజలని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Update: 2022-07-05 01:30 GMT

Health Tips: ఈ గింజలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే ఈ వ్యాధులు నయం..!

Health Tips: ఉదయాన్నే 4 రకాల నానబెట్టిన గింజలని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు తింటే చురుకుగా ఉంటారు. రోజంతా శక్తివంతంగా ఉంటారు. బాదంపప్పు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వీటితో పాటు చాలా రకాల గింజలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే మంచి ఫలితాలని ఇస్తాయి. అలాంటి 4 రకాల గింజల గురించి తెలుసుకుందాం.

బాదం

బాదం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. బాదం అనేది ఒక డ్రై ఫ్రూట్, ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా బాదంపప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. అంతేకాదు వేగంగా బరువు తగ్గుతారు. మీ జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. బాదంలో మంచి కొవ్వు ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. పీరియడ్స్ సక్రమంగా లేని మహిళలు వీటిని తింటే మంచి ఉపశమనం ఉంటుంది.

మెంతులు

మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండాలి. దీనికోసం మీకు నానబెట్టిన మెంతులు సహాయపడతాయి. ఇందుకోసం మెంతి గింజలను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం పరగడుపున మెంతి గింజలను నీటితో తీసుకోవాలి. దీంతో మీ శరీరంలో ఇన్సులిన్ మొత్తం సరిగ్గా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

జీలకర్ర, సోంపు

కిచెన్‌లో ఉండే అజ్వైన్, జీలకర్ర, సోంపు వంటి మూడు వస్తువులు అధిక బరువును తగ్గించగలవు. ఇది కాకుండా మీకు జీర్ణ సమస్యలు ఉంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఈ మూడింటిని సమపాళ్లలో కలిపి ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఇది మీ బరువును తగ్గించడమే కాకుండా దీనివల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

Tags:    

Similar News