Managing Uric Acid Levels: ఇవి తింటే.. యూరిక్‌ యాసిడ్‌ మటుమాయం కావడం పక్కా..!

Managing Uric Acid Levels: శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరిగితే తీవ్ర సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. యువత ఇటీవల ఈ సమస్య బారిన పడడం ఎక్కువుతోంది.

Update: 2025-02-13 10:50 GMT

Managing Uric Acid Levels: ఇవి తింటే.. యూరిక్‌ యాసిడ్‌ మటుమాయం కావడం పక్కా..!

Managing Uric Acid Levels:

శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరిగితే తీవ్ర సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. యువత ఇటీవల ఈ సమస్య బారిన పడడం ఎక్కువుతోంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదలను హైపర్‌యూరిసెమియా అంటారు. కీళ్ల నొప్పులు మొదలు ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది కారణమవుతుంది. అయితే వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే శరీరంలో యూరిక్‌ యాసిడ్ తగ్గాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

* యూరిక్‌ యాసిడ్‌ను తగ్గించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురించిన అధ్యయనం నిమ్మకాయ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉందని తేలింది. నీటిలో నిమ్మరసం, బేకింగ్‌ సోడా కలిపి రోజూ తీసుకుంటే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.

* పుట్టగొడుగులలో బీటా-గ్లూకాన్స్ కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను నివారించడంలో సహాయపడుతుంది.

* ఇక దోసకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది యూరిక్‌ యాసిడ్‌ను సులభంగా తొలగిస్తుంది. దోసకాయలో లభించే నీరు యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గిస్తుంది.

* టమోటాలు కూడా శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్‌ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో పాటు విటమిన్‌ సి పుష్కలంగా ఉండే నారింజ, నిమ్మకాయలు, కివీస్, జామపండ్లు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ వంటివి తీసుకోవాలి.

* అలాగే శరీరంలో యూరిక్‌ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటే ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహౄరం తీసుకుంటే రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ తగ్గుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలలో ఆకుకూరలు, ఓట్స్, తృణధాన్యాలు, బ్రోకలీ, గుమ్మడికాయ, బేరి, సెలెరీ, దోసకాయలు, బ్లూబెర్రీస్, ఆపిల్, నారింజ వంటివి ఉంటాయి.

* ఇక యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గించడంలో తాజా కూరగాయల రసం కూడా ఉపయోగపడుతుంది. క్యారెట్, దోసకాయ, బీట్‌రూట్‌తో పాటు తాజా కూరగాయల రసాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటన్నింటితో పాటు రోజూ సరిపడ నీటిని తీసుకోవాలి.

Tags:    

Similar News