Health Tips: ఈ 4 వస్తువులను రిఫ్రిజిరేటర్‌లో అస్సలు ఉంచకండి.. వాటిని తింటే రోగాల పాలే

Health Tips: వేసవిలో ఆహార పదార్థాలు చాలా త్వరగా చెడిపోతాయి. అటువంటి పరిస్థితిలో, రిఫ్రిజిరేటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో ఆహార పదార్ధాలు ఉంచడం వల్ల చాలా రోజులు తాజాగా ఉంటాయి.

Update: 2025-05-25 14:30 GMT

Health Tips: వేసవిలో ఆహార పదార్థాలు చాలా త్వరగా చెడిపోతాయి. అటువంటి పరిస్థితిలో, రిఫ్రిజిరేటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో ఆహార పదార్ధాలు ఉంచడం వల్ల చాలా రోజులు తాజాగా ఉంటాయి. కానీ, ఎట్టిపరిస్థితిలోనూ ఈ 4 ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. ఎందుకంటే, రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత కారణంగా ఈ ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. ఇలాంటి వాటిని తింటే ఆరోగ్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వెల్లుల్లి

మీరు తొక్క తీసిన వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. ఎందుకంటే అది త్వరగా బూజు పట్టిపోతుంది. బూజు పట్టిన వెల్లుల్లిని తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వెల్లుల్లిని ఎప్పుడూ కూడా గాలి వచ్చే ప్రదేశంలో ఉంచాలి.

ఉల్లిపాయ

ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వాటి స్టార్చ్ చక్కెరగా మారుతుంది. ఇది ఫంగస్ పెరగడానికి కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు తరిగిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల కూడా ఆరోగ్యానికి హానికరం.ఎందుకంటే దానిపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.

అన్నం

అన్నం 24 గంటల కంటే ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే అందులో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. అన్నం ఎక్కువగా మిగిలి ఉంటే, దానిని గాలి చొరబడని డబ్బాలో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే మంచిది. కానీ, ఆ అన్నంను ఒక రోజులోపు తినేయండి.

అల్లం

అల్లం కూడా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే దానిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాం ఉంది. ఇది శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Tags:    

Similar News