Health Tips: అతిగా ఫుడ్‌ తినే అలవాటుని మార్చుకోండి.. లేదంటే ఈ సమస్య తప్పదు..!

Health Tips: రుచికరమైన ఆహారం తినడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి.

Update: 2022-06-22 06:30 GMT

Health Tips: అతిగా ఫుడ్‌ తినే అలవాటుని మార్చుకోండి.. లేదంటే ఈ సమస్య తప్పదు..!

Health Tips: రుచికరమైన ఆహారం తినడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఆహారం కడుపు నింపే సాధనం మాత్రమే కాదు శరీరానికి పోషక అవసరాలను తీర్చే సాధనం కూడా. అయితే ఆహారం తిన్న కొద్దిసేపటికే చాలా మంది మళ్లీ తినడం ప్రారంభిస్తారు. చాక్లెట్, ఐస్ క్రీం ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇంకా చాలామంది ఫాస్ట్ ఫుడ్ తినడానికిబయటకు వెళ్తారు. ఇలాంటి అలవాటు అస్సలు మంచిది కాదు. అయితే అతిగా ఫుడ్‌ తినే అలవాటుని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.

మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి

ఆహార కోరికలను అనుచుకోవడానికి ఆకలితో ఉండవలసిన అవసరం లేదు. ఆకలి అనేది మీ ఇంద్రియాలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. అందుకే మీరు పదే పదే తింటారు. ఈ సమయంలో మీరు ఆహార కోరికలను నివారించడానికి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అవసరం.

తాజా ఆహారం తినాలి

ఆహార కోరికలను నివారించడానికి మీరు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. వేడి ఆహారాన్ని తీసుకోకపోతే కొంత సమయం తర్వాత మళ్లీ ఏదైనా తినాలని అనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మీరు తాజా ఆహారాన్ని తీసుకుంటే ఆహార కోరిక తీరుతుంది. అలాగే అతిగా తినే అలవాటుని నివారించవచ్చు. అలాగే ఆహారం తిన్న తర్వాత కొంత సమయం తర్వాత నీరు తాగాలని గుర్తుంచుకోండి.

నిద్రవేళపై శ్రద్ధ వహించండి

ఈ రోజుల్లో సమయానికి నిద్రపోవడం ఉదయమే నిద్రలేచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ కారణం వల్ల కూడా అతిగా తింటారు. కాబట్టి రాత్రి 11 గంటలకు ముందే నిద్రపోయి ఉదయం 6 గంటలకు లేస్తే ఆరోగ్యంగా ఉంటారు.

Tags:    

Similar News