మెడపై చర్మం నల్లగా ఉందా.. వీటితో తెల్లగా మార్చుకోండి..!

Black Neck: ముఖంతో పాటు శరీరంలోని మిగిలిన భాగాలు కూడా మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు...

Update: 2022-04-01 08:30 GMT

మెడపై చర్మం నల్లగా ఉందా.. వీటితో తెల్లగా మార్చుకోండి..!

Black Neck: ముఖంతో పాటు శరీరంలోని మిగిలిన భాగాలు కూడా మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే కొంతమందికి సూర్యరశ్మి వల్ల మెడపై చర్మం నల్లగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ లేదా అనేక కారణాల వల్ల వస్తుంది. ఈ నలుపు తొలగించడం అంత సులభం కాదని అందరికి తెలుసు. చాలామంది మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని వాడుతారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. కానీ హోం రెమిడిస్ ద్వారా ఈ నలుపుని తొలగించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

1. పచ్చి పాలు, బొప్పాయి ప్యాక్

పచ్చి పాలు, బొప్పాయి ప్యాక్ అప్లై చేస్తే ముఖం, మెడ కాంతివంతంగా తయారవుతుంది. పచ్చి పాలకు చర్మాన్ని బ్లీచ్ చేసి తేమగా మార్చే గుణం ఉంటుంది. అలాగే బొప్పాయి చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది.

2. దోసకాయ, కలబంద, రోజ్ వాటర్ ప్యాక్

దోసకాయ, అలోవెరా జెల్ రెండింటిలోనూ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బ్లీచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయినప్పటికీ మీరు ఈ హోం రెమెడీ నుంచి తక్షణ ప్రయోజనాలను పొందలేరు. కానీ తరచుగా అప్లైచేస్తే ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. రోజ్ వాటర్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

3. టమోటా రసం, కాఫీ పొడి

టొమాటో విటమిన్-సికి మంచి మూలం. కాఫీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల మెడపై నలుపు తగ్గుతుంది.

4. పెరుగు, శెనగపిండి, పసుపు

పెరుగు, శెనగపిండి రెండూ ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే పసుపు చర్మాన్ని బ్లీచ్ చేస్తుంది. మృత చర్మాన్ని తొలగించి చర్మానికి సహజసిద్దమైన మెరుపును ఇస్తుంది.

Tags:    

Similar News