Pink Lips: గులాబి రంగు పెదవుల కోసం మెరుగైన మూడు చిట్కాలు..!

Pink Lips: గులాబి రంగు పెదవుల కోసం మెరుగైన మూడు చిట్కాలు..!

Update: 2022-03-30 15:00 GMT

Pink Lips: గులాబి రంగు పెదవుల కోసం మెరుగైన మూడు చిట్కాలు..!

Pink Lips: మీకు అందమైన గులాబీ రంగు, మృదువైన పెదాలు కావాలంటే ఈ వార్త మీ కోసమే. మారుతున్న కాలంలో పెదవులు పొడిబారి నల్లగా మారుతున్నాయి. దీనివల్ల వల్ల కొన్నిసార్లు పెదవులు పగిలి రక్తం రావడం మొదలవుతుంది. ఈ సీజన్‌లో పెదాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెదాలు ఎప్పుడూ తేమగా ఉండాలంటే కొన్ని పద్ధతులను కచ్చితంగా పాటించాలి.

1. ఎక్కువ నీరు తాగాలి

మారుతున్న కాలంలో మీ చర్మానికి నీరు అతిపెద్ద నివారణ. ఎందుకంటే నీటి కొరత వల్ల చర్మం, పెదవులపై పగుళ్లు ఏర్పడతాయి. నీరు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. దీంతో పాటు నీరు మీ పెదవులపై తేమను నిలిపేలా చేస్తుంది. వాటిని మృదువుగా ఉంచుతుంది. పెదవులని పదే పదే నాలుకతో తడపకూడదు. ఇలా చేయడం వల్ల పెదవులు మరింత పగిలిపోతాయి.

2. మాయిశ్చరైజర్

ముఖం, చర్మానికి ఉత్తమమైన మాయిశ్చరైజర్ ఎంత అవసరమో అదే విధంగా పెదాలకు కూడా అత్యుత్తమ మాయిశ్చరైజర్ అవసరం. పెదవులలో తేమను నిలుపుకోవడానికి బాదం నూనె సీరమ్ లేదా కొబ్బరి నూనె సీరమ్ ఉపయోగించండి. మీరు రాత్రి పడుకునే ముందు ఈ సీరమ్‌ను అప్లై చేయవచ్చు. ఇంట్లో ఈ సీరమ్ సిద్ధం చేయడానికి ఒక టీస్పూన్ బాదం నూనె తీసుకోండి. ఇప్పుడు విటమిన్ సి క్యాప్సూల్, కొన్ని చుక్కల గ్లిజరిన్ తీసుకోండి. వీటిని బాగా కలపండి. ఇప్పుడు రోజూ నిద్రపోయే ముందు ఈ సీరమ్‌ను పెదవులపై అప్లై చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారుతాయి.

3. హోంమేడ్ రెమిడీ

మీరు ఫేస్, హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నప్పుడు లిప్ ప్యాక్ ఎందుకు వేసుకోకూడదు. లిప్స్ మిశ్రమాన్ని రెడీ చేయడానికి ఒక చెంచా తేనె తీసుకోండి. దానికి కొన్ని చుక్కల కొబ్బరి నూనె కలపండి. దీన్ని చెంచా సహాయంతో పెదవులపై అప్లై చేయండి. దీని కారణంగా పెదవులపై తేమ ఉంటుంది. పెదవులు ఎక్కువగా పగిలిపోతే చిటికెడు పసుపు రుద్దండి. అంతేకాదు పెదవులపై దేశీ నెయ్యిని కూడా అప్లై చేయవచ్చు.

Tags:    

Similar News