Constipation: ఈ ఆయుర్వేద నివారణలతో మలబద్దకానికి చెక్..!

Constipation: ఈ ఆయుర్వేద నివారణలతో మలబద్దకానికి చెక్..!

Update: 2022-10-14 02:47 GMT

Constipation: ఈ ఆయుర్వేద నివారణలతో మలబద్దకానికి చెక్..!

Constipation: చెడు జీవనశైలి కారణంగా చాలామంది కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్ల అనేక ఇతర వ్యాధులు సంభవిస్తున్నాయి. ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం వంటి అనేక తీవ్రమైన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దాదాపు ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారు. అయితే దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

మలబద్ధకానికి అత్యంత సాధారణ కారణం హెవీ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్‌, నాన్-ఫైబర్ ఫుడ్ తీసుకోవడం. చల్లటి నీరు తాగకుంటే కొంతమందికి దాహం తీరదు. అయితే చల్లటి నీరు కూడా మలబద్ధకం సమస్యను కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వాతం అధికంగా ఉండటం వల్ల కూడా మలబద్ధకం సంభవిస్తుంది. అయితే మలబద్దకం నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

ఇంగువ

మలబద్దకానికి ఇంగువ చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. ఇది వాతాన్ని సమతుల్యం చేయగలదు. చేయాల్సిందల్లా వంట చేసేటప్పుడు ఇంగువ వాడటమే. ఇది కడుపు సమస్యలు, మలబద్ధకం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఇంగువ పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో పిల్లలకు కడుపు సమస్యలు ఉంటే ఆహారంలో ఇంగువ ఉపయోగించండి. తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

జీలకర్ర

మలబద్ధకానికి జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. ఇది వాత శక్తిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చేయాల్సిందల్లా మలబద్ధకం సమస్యలో జీలకర్ర నీటిని తాగడం. మలబద్ధకంతో పాటు, ఉబ్బరం, గ్యాస్ట్రిక్, అజీర్ణం సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందుతారు.

సోంపు

సోంపులో ఉండే ఆయుర్వేద గుణాలు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చేయాల్సిందల్లా ఆహారం తిన్న తర్వాత సోంపు నమలడం, ఇలా చేయడం వల్ల మెటబాలిజం చక్కగా ఉంటుంది. పొట్ట సమస్య దూరమవుతుంది. మలబద్ధకం సమస్యకు సోంపు దివ్యౌషధమని చెప్పవచ్చు.

Tags:    

Similar News