Hair Growth: కర్పూరం పొడి ఇలా వాడితే మీ జుట్టు మోకాళ్ల పొడుగు పెరగడం ఖాయం..!

Camphor Hair Growth: కర్పూరం పూజలో వినియోగిస్తాం. వాస్తు పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.. అయితే కర్పూరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల చుండ్రులను తగ్గించేస్తుంది. కర్పూరం ఇలా వాడితే జుట్టు నడుం వరకు పెరగడం ఖాయం.

Update: 2025-03-14 07:42 GMT

Hair Growth: కర్పూరం పొడి ఇలా వాడితే మీ జుట్టు మోకాళ్ల పొడుగు పెరగడం ఖాయం..!

Camphor Hair Growth: జుట్టు పెరుగుదలకు కర్పూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రక్తప్రసరణను మెరుగు చేస్తుంది. దీంతో కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా జుట్టు పెరుగుతుంది. ఇది యాంటీ సెప్టిక్‌ గుణాలు కలిగి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాదు కర్పూరంలో మాయిశ్చర్ గుణాలు జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. మీ హెయిర్ రొటీన్ లో కర్పూరం ఇలా చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది.

హెడ్‌ మసాజ్..

కొబ్బరి నూనెతో కలిపి కర్పూరాన్ని నానపెట్టాలి. కాస్త వేడి చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. ఆ తర్వాత మృదువగా వేళ్ల సహాయంతో జుట్టు కుదుళ్ల నుంచి మసాజ్ చేయాలి. ఓ అరగంట తర్వాత తల స్నానం చేయాలి.. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. కుదుళ్లలో రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది.

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనెలో కలిపి రాని జుట్టుకు కర్పూరం అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండిటిని కలిపి గోరువెచ్చగా చేసి జుట్టు అంతటికే అప్లై చేయాలి. తలస్నానం చేసే ఒక గంట ముందు అప్లై చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి.

హెయిర్‌ మాస్క్‌..

కర్పూరం, కలబంద రెండు కలిపి జుట్టుకు హెయిర్ మాస్కులు తయారు చేసుకోవచ్చు, అరగంట పాటు జుట్టు అంతటికి అప్లై చేసి ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి మాయిశ్చర్ అందుతుంది. అంతేకాదు మృదువుగా పెరుగుతుంది. స్ప్లిట్ ఎండ్ సమస్య కూడా ఉండదు. కర్పూరం పెరుగులో కలిపి కూడా మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఎండాకాలం ఈ మాస్క్‌ అప్లై చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. ఆరోగ్యంగా షైనీ లుక్‌ పొందుతారు. తలస్నానం చేసే ఓ గంట ముందు ఈ రెండిటిని బాగా మెత్తగా పేస్టు మాదిరి తయారు చేసుకుని తలంతటికీ అప్లై చేయాలి.. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నేచురల్ షైనీ లుక్‌ పొందుతారు. జుట్టు నడుము వరకు పెరగడం ఖాయం.

Tags:    

Similar News