Health Tips: ఊబకాయం, కొలస్ట్రాల్‌ రావొద్దంటే గోధుమలు వద్దు.. బార్లీ ముద్దు..!

Health Tips: ఊబకాయం, కొలస్ట్రాల్‌ రావొద్దంటే గోధుమలు వద్దు.. బార్లీ ముద్దు..!

Update: 2022-07-05 07:00 GMT

Health Tips: ఊబకాయం, కొలస్ట్రాల్‌ రావొద్దంటే గోధుమలు వద్దు.. బార్లీ ముద్దు..!

Health Tips: మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే ముందుగా గోధుమ పిండితో చేసిన రోటీలని మానెయ్యండి. బదులుగా మీరు బార్లీ పిండితో చేసిన రోటీలను తినాలి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బార్లీ పిండిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. బార్లీ పిండి పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ప్రొటీన్, పీచు, బి విటమిన్లు, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇది చాలా తక్కువ కేలరీల ఆహారం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

1. బరువు తగ్గడం

బార్లీ పిండి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. బార్లీ ఒక గొప్ప ఫైబర్, తక్కువ కేలరీల ఆహారం. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

బార్లీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. బార్లీలో కరగని పీచు ఉంటుంది. ఇది కడుపుకు మంచిది. దీని వల్ల మలబద్ధకం సమస్య ఉండదు.

3. కొలెస్ట్రాల్ తగ్గుతుంది

ఈ రోజుల్లో నూనె తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెలో అడ్డంకిని కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో మీరు బార్లీతో చేసిన వాటిని తినాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో 'చెడు' కొలెస్ట్రాల్‌ను తగ్గించే బీటా-గ్లూకాన్స్ బైల్ యాసిడ్ ఉంటుంది.

4. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఈ రోజుల్లో గుండె సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రజలు బార్లీతో చేసిన వాటిని డైట్‌లో చేర్చుకోవాలి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Tags:    

Similar News