Health Tips: పరగడుపున ఈ సూపర్‌ఫుడ్స్ తినండి.. వ్యాధులు మీ దరిచేరవు..!

Health Tips: ప్రతిరోజు శక్తివంతమైన ఆహారం తీసుకుంటే ఎలాంటి వ్యాధులైనా దూరంగా ఉంటాయి. చాలా వ్యాధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అటాక్‌ చేస్తాయి.

Update: 2024-02-07 00:30 GMT

Health Tips: పరగడుపున ఈ సూపర్‌ఫుడ్స్ తినండి.. వ్యాధులు మీ దరిచేరవు..!

Health Tips: ప్రతిరోజు శక్తివంతమైన ఆహారం తీసుకుంటే ఎలాంటి వ్యాధులైనా దూరంగా ఉంటాయి. చాలా వ్యాధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అటాక్‌ చేస్తాయి. అందుకే శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పరగడుపున కొన్ని సూపర్ ఫుడ్స్ తినాలి. వీటివల్ల వ్యాధులు దూరంగా ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. దీనిని పరగడుపున తింటే శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే ఉపశమనం లభిస్తుంది.

ఖర్జూర

ఖర్జూరాలను పరగడుపున తింటే రెట్టింపు శక్తి లభిస్తుంది. రోజూ రెండు ఖర్జూరాలను ఖాళీ కడుపుతో తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనితో పాటు సులువుగా బరువు తగ్గుతారు.

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఏవైనా గింజలను నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

అరటి, ఆపిల్

అరటిపండు, యాపిల్‌ను పరగడుపుతో తింటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా రోజూ ఒక యాపిల్ తింటే రోగాలు దూరం అవుతాయి. యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆహారం ఎక్కువగా తినకుండా ఉంటారు.

Tags:    

Similar News