Health Tips: మూడ్‌ బాగా లేకుంటే వీటిని తినండి.. వెంటనే సెట్ అవుతారు..!

Health Tips: శరీరంలో సెరటోనిన్ పెరిగినప్పుడు మానసిక స్థితి బాగుంటుంది.

Update: 2023-03-25 13:30 GMT

Health Tips: మూడ్‌ బాగా లేకుంటే వీటిని తినండి.. వెంటనే సెట్ అవుతారు..!

Health Tips: శరీరంలో సెరటోనిన్ పెరిగినప్పుడు మానసిక స్థితి బాగుంటుంది. ఇది ఒక రకమైన హార్మోన్. ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్, చెడు జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీనిని తగ్గించుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. ముఖ్యంగా సెరోటోనిన్ పెంచే ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది. డైట్‌లో ఏయే ఆహారాలను చేర్చుకోవాలో తెలుసుకుందాం.

అరటిపండ్లు

మూడ్‌ బాగాలేనప్పుడు అరటిపండు తినవచ్చు. ఇందులో అమినో యాసిడ్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి పనిచేస్తుంది. అరటిపండ్లను స్మూతీస్, షేక్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇవి మీ నిద్ర నాణ్యతను పెంచుతాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.

బాదం

బాదంపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఫోలేట్ అధికంగా లభిస్తాయి. మెగ్నీషియం సెరోటోనిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. బాదంపప్పులో విటమిన్ బి2, ఇ కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతాయి.

పైనాపిల్‌

పైనాపిల్‌లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది సెరోటోనిన్‌ను పెంచడానికి పని చేస్తుంది. ఇందులో బ్రోమెలైన్ ప్రొటీన్ ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. మీరు అనేక విధాలుగా పైనాపిల్ తినవచ్చు.

సోయా ఉత్పత్తులు

సోయా ఉత్పత్తులలో ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటుంది. ఇవి సెరోటోనిన్‌ను పెంచడానికి పని చేస్తాయి. సోయా పాలు, టోఫు, సోయాబీన్ మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలు ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలను అందించడానికి పని చేస్తాయి.

పాలకూర

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బచ్చలికూర శరీరంలో సెరోటోనిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. పాలకూరను స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News