Health Tips: మోకాళ్లు బలంగా ఉండాలంటే ఈ 3 ఆహారాలు తప్పనిసరి..!
Health Tips: ఈ రోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
Health Tips: మోకాళ్లు బలంగా ఉండాలంటే ఈ 3 ఆహారాలు తప్పనిసరి..!
Health Tips: ఈ రోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసు పెరిగేకొద్దీ దీర్ఘకాలిక నొప్పులు మొదలవుతాయి. ఈ పరిస్థితుల్లో మనం ఎక్కడా ఎక్కువసేపు కూర్చోలేము. ఎక్కువసేపు నడవలేము. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. కాల్షియం ఎముకలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఏదైనా కారణం వల్ల మీకు కీళ్ల నొప్పులు ఉంటే మీరు మరికొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలం, చలికాలంలో కీళ్ల నొప్పులు గణనీయంగా పెరుగుతాయి. ఈ పరిస్థితిలో మీరు ఆహారంలో మార్పులు చేయడమే కాకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మీరు చిన్నప్పటి నుంచి కాల్షియం పుష్కలంగా తీసుకుంటే ఇది మీ సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
1. పాలు తీసుకోవడం
పాలు మీ ఎముకలను బలోపేతం చేయడానికి, కండరాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతాయి. పాలలో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అదనంగా ఇందులో భాస్వరం, మెగ్నీషియం, అయోడిన్, విటమిన్లు A, D, K, E వంటి అనేక ఖనిజాలు, కొవ్వులు ఉంటాయి. అందుకే పాలని ఎక్కువగా తీసుకోవాలి.
2. అల్లం
అల్లం కీళ్ల నొప్పులు, కండరాలకు గొప్ప చికిత్సగా చెప్పవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికి ఒక కప్పు పాలలో అల్లం కలిపి తీసుకోవాలి.
3. గింజలు
ప్రతి ఒక్కరికి నట్స్ ప్రయోజనాల గురించి తెలుసు. వీటిని ప్రతిరోజూ తినే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. వివిధ గింజలను తినడం ద్వారా మీరు అనేక పోషకాలను పొందుతారు. ఇవి మీ కీళ్ల నొప్పులకు సహాయపడుతాయి. దీంతో పాటు కండరాలకి ప్రయోజనంగా చెప్పవచ్చు. నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ వాల్‌నట్స్, బాదం, అవిసె గింజలతో పాటు పైన్ గింజలను తీసుకోవాలి.