Heart Attack: 30 రోజుల ముందే గుండెపోటును పసిగ‌ట్టొచ్చు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే అల‌ర్ట్ అవ్వాల్సిందే

Heart Attack: జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే గుండెపోటు సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు యువతలో కూడా హార్ట్ స్ట్రోక్‌లు నమోదవుతున్నాయి.

Update: 2025-06-03 10:00 GMT

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుండెపోటు అనేది అకస్మాత్తుగా జరిగే విషయం కాదు. మన శరీరం ముందుగానే కొన్ని సూచనలు ఇస్తుందని వారు చెబుతున్నారు. ఈ సంకేతాలను సమయానికి గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చు. ఆ ల‌క్ష‌ణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాతీ, భుజం, దవడలో నొప్పి

గుండెపోటు సంభవించబోయే సమయంలో ఛాతీ చుట్టూ ఒత్తిడి, నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించ‌వ‌చ్చు. కొందరికి ఈ నొప్పి భుజాలకు, చేతులకు, దవడకు పాకవచ్చు. ముఖ్యంగా ఈ భాగాల్లో ఏ కారణం లేకుండా నొప్పి రావడం అనేది గుండెపోటుకు ముందు కనిపించే హెచ్చరికల్లో ఒకటి. అలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.

తీవ్ర‌మైన అల‌స‌ట

సాధారణంగా శ్రమతో వచ్చే అలసట వేరే. కానీ మామూలుగా పని చేయకున్నా శరీరం మునుపటిలా చురుకుగా లేకపోవడం, చిన్న పనిలోనే విసుగుగా అనిపించడం గుండె సంబంధిత సమస్యకు సంకేతమవచ్చు. తరచూ అలసటగా ఉండడం, శక్తిలేనట్టు అనిపించడం కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

త‌ల‌తిర‌గ‌డం

గుండెపోటు వ‌చ్చే కొన్ని వారాల ముందు తల తిరగడం, ఒక్కోసారి మూర్ఛ పోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది రక్త ప్రసరణలో లోపం కారణంగా జ‌రుగుతుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రాణాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.

శ్వాస ఇబ్బందులు

ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చిన్న పని చేసిన తర్వాత కూడా శ్వాస పీల్చలేకపోవడం గుండెపోటుకు ముఖ్యమైన సంకేతం. ఈ పరిస్థితి హృదయానికి రక్త సరఫరా సరైన స్థాయిలో జరగకపోవడం వల్ల కలుగుతుంది.

Tags:    

Similar News