Women Health: చాలామంది మహిళలు చేసే తప్పు ఇదే.. అందుకే ఐరన్‌లోపానికి గురవుతున్నారు..!

Women Health: ఆధునిక కాలంలో చాలామంది మహిళలు, యువతులు ఐరన్‌ లోపంతో బాధ పడుతున్నారు.

Update: 2024-03-26 13:00 GMT

Women Health: చాలామంది మహిళలు చేసే తప్పు ఇదే.. అందుకే ఐరన్‌లోపానికి గురవుతున్నారు..!

Women Health: ఆధునిక కాలంలో చాలామంది మహిళలు, యువతులు ఐరన్‌ లోపంతో బాధ పడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ బాధ్యతల వల్ల వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఐరన్‌ లోపం ఏర్పడి అనారోగ్యానికి గురవుతున్నారు. వాస్తవానికి వీరు ఐరన్‌ లోపాన్ని సులువుగా భర్తీ చేయవచ్చు. కానీ దీని గురించి అస్సలు పట్టించుకోరు. ఏ కారణాల వల్ల వీరు ఐరన్‌ లోపానికి గురవుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం.

మహిళల్లో ఐరన్ లోపానికి ప్రధాన కారణం పోషకాహారం తీసుకోకపోవడమే. మనవారికి ఆహారం రుచిగా ఉంటే చాలు అందులో పోషకాలు ఉన్నాయా లేదా అనేది అవసరం లేదు. మహిళలు , యువతులు ప్రతిరోజు పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. చాలా మంది మహిళలు మాంసం, చేపలు, చిక్కుళ్లు, బీన్స్, ఆకుపచ్చ కూరగాయల వంటి ఆహారాలు తినరు. మరికొందరు పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. ఐరన్ లోపానికి ఇవి ప్రధానమైన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు.

మహిళలకు రుతుక్రమం వల్ల అధిక రక్త నష్టం జరిగి శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గుతాయి. అయితే ఐరన్-రిచ్ ఫుడ్స్ తినడం ద్వారా దీని లోపాన్ని భర్తీ చేయవచ్చు. కానీ చాలామందికి వీటిపై అవగాహన ఉండదు. ఐరన్, హిమోగ్లోబిన్ స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయడం ద్వారా ఐరన్ లోపాన్ని ప్రారంభ దశలోనే నివారించవచ్చు. ఐరన్‌ లోపాన్ని ఎదుర్కోవడానికి జీవనశైలి మార్పులు చేసుకోవాలి. లీన్ మాంసాలు, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, చిక్కుళ్ళు, తృణధాన్యాల వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచే సిట్రస్ పండ్లు, టమోటాలు, వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్‌ తినాలి. టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదు. రుతుక్రమంలో అధిక రక్తస్రావంతో బాధపడే స్త్రీలు ఐరన్ అవసరాలను తీర్చుకోవడానికి డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరించడం వల్ల మొత్తం ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.

Tags:    

Similar News