Dry Chia seeds: మీరు చియా గింజలను ఎక్కువగా తింటున్నారా? అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి
Dry Chia seeds: ఈ మద్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో చాలామంది చియా గింజలను ఎక్కువగా తింటున్నారు. అయితే నానబెట్టకుండా తింటే ప్రమాదాలకు గురవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
Dry Chia seeds: మీరు చియా గింజలను ఎక్కువగా తింటున్నారా? అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి
Dry Chia seeds: ఈ మద్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో చాలామంది చియా గింజలను ఎక్కువగా తింటున్నారు. అయితే నానబెట్టకుండా తింటే ప్రమాదాలకు గురవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని పద్దతుల ప్రకారం వాటిని తింటే హాస్పిటల్ పాలయ్యే ప్రమాదం ఉండదని హెచ్చరిస్తున్నారు.
స్మూతీస్ నుండి ఫుడింగ్స్ వరకు ఇప్పుడు అన్నింటిలో చియా సీడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద ఉన్నవారు ఆహారంలో వీటిని భాగం చేసుకున్నారు. దీంతో ప్రతిరోజూ వీటిని తింటున్నారు. అయితే ఇటీవల ఒక వ్యక్తి సరిగా నానబెట్టని చియా సీడ్స్ తిని హాస్పిటల్ పాలయ్యాడు. అతని గొంతులో చియా సీడ్స్ ఇరుక్కుపోయాయి. హాస్పిటల్‌కు వెళ్లిన అతనికి చాలా కష్టాలు పడిన తర్వాత రిలీఫ్ వచ్చింది.
చియా సీడ్స్ సరిగా నాకపోతే ఏం జరుగుతుంది?
చియా సీడ్స్ నానబెట్టకుండా నోటిలో వేసుకుంటే అవి గొంతులోనే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. గొంతులోకి వెళ్లిన తర్వాత అక్కడ వాటికి తడి తగులుతుంది. దీంతో అక్కడ అవి ఉబ్బడం వల్ల గొంతులో ఇరుక్కుంటాయి.
చియాసీడ్స్ సరిగా నానకుండా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీంతో గ్యాస్టిక్ సమస్యలు కూడా పెరుగుతాయి.
నానబెట్టని చియా సీడ్స్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది.
ఎలా తినాలి?
చియా సీడ్స్ పూర్తిగా నానడానికి అరగంట లేదా గంట సమయం పడుతుంది. ఎందుకంటే చియా సీడ్స్ తమ బరువుకి 27 రెట్లతో సమానమైన నీటిని పీల్చుకుంటాయి. అందుకే అవి పూర్తిగా నానాలంటే అరగంట నుంచి గంట వరకు సమయం పడుతుంది. ఆ తర్వాతే తినాలి. అప్పుడే అందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి.