Drumstick: చెట్టు నుంచి ఆకుల వరకు అన్ని ఔషధాలే..!

Drumstick: దీని వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ మెయింటైన్ అవుతాయి. మాంసం, చేపలకు దూరంగా ఉండేవారికి మునగకాయ మంచి ప్రొటీన్ల మూలం.

Update: 2022-11-26 08:03 GMT

Drumstick: చెట్టు నుంచి ఆకుల వరకు అన్ని ఔషధాలే..!

Drumstick: కొంతమందికి ములక్కాడ అంటే నచ్చదు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఈ చెట్టులోని ప్రతి భాగం ఔషధమే. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. దీని వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ మెయింటైన్ అవుతాయి. మాంసం, చేపలకు దూరంగా ఉండేవారికి మునగకాయ మంచి ప్రొటీన్ల మూలం. వీటి ఇతర ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

1. మునగలో ఉండే ఫైటోకెమికల్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బాహ్య ఇన్ఫెక్షన్ల నుంచి మనలను కాపాడుతుంది.

2. ఈ రోజుల్లో రక్తహీనత చాలా మందిలో ఉంది. మునగ శరీరంలో ఐరన్ లోపాన్ని తీరుస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలకు మేలు చేస్తాయి. వాటి కణజాలాలను రక్షిస్తాయి.

3. దీని ఆకులను గ్రైండ్ చేసి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తూ, ముఖానికి కొత్త మెరుపు వస్తుంది.

4. మునగ నూనె జుట్టు పెరుగుదలకు ప్రయోజనకరంగా పనిచేస్తుంది. దీంతో పాటు ఇది జుట్టు రాలడం నుంచి కాపాడుతుంది.

5. మీరు పొట్టకు సంబంధించిన ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా మునగ కూర తినండి. ఇది మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కడుపు జీవక్రియను సరిచేస్తుంది. దీనివల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోదు.

Tags:    

Similar News