Lemon Water Side Effects: నిమ్మరసం ఎక్కువగా తాగితే ఈ నష్టాలు తప్పవు..!

Lemon Water Side Effects: లెమన్ వాటర్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికి తెలుసు.

Update: 2022-08-16 11:30 GMT

Lemon Water Side Effects: నిమ్మరసం ఎక్కువగా తాగితే ఈ నష్టాలు తప్పవు..!

Lemon Water Side Effects: లెమన్ వాటర్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికి తెలుసు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే సులువుగా బరువు తగ్గుతారు. దీంతోపాటు నిమ్మకాయ మన జీర్ణక్రియలో చాలా సహాయపడుతుంది. దీని కారణంగా కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి.అయినప్పటికీ ఏదైనా అతిగా తీసుకోవడం హానికరమే. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో ఈ పోషకాల స్థాయి పెరిగితే చాలా ముఖ్యమైన అవయవాలపై చెడు ప్రభావం ఉంటుంది. కాబట్టి చాలా మంది వైద్యులు నిమ్మరసం పరిమిత పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తారు.

1. కడుపునొప్పి

విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్ల స్రావం పెరుగుతుంది. దీనివల్ల కడుపులో ఎసిడిటీ ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య ఇక్కడితో ఆగదు. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు వస్తాయి. చాలా మంది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్‌తో బాధపడుతారు. వారు తక్కువ నిమ్మరసం తీసుకోవాలి.

2. నోటిలో బొబ్బలు

నిమ్మకాయ తరచుగా నోటి దుర్వాసన ,దంతాలను శుభ్రపరుస్తుంది. అయితే మీరు నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగితే అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటి కణజాలాలలో వాపును కలిగిస్తుంది. దీని కారణంగా పొక్కులు , చికాకు పుడుతుంది.

3. బలహీనమైన దంతాలు

మీరు ఎక్కువగా నిమ్మరసం తాగితే దంతాలు బలహీనమవుతాయి. ఇందులో ఉండే యాసిడ్స్ దంతాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.

Tags:    

Similar News