Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!

Health Tips: నేటి కాలంలో రెడీ-టు-ఈట్ ఫుడ్స్ తీసుకునే ట్రెండ్ వేగంగా ఊపందుకుంటోంది.

Update: 2022-06-29 09:30 GMT

Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!

Health Tips: నేటి కాలంలో రెడీ-టు-ఈట్ ఫుడ్స్ తీసుకునే ట్రెండ్ వేగంగా ఊపందుకుంటోంది. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ప్రజలు ప్యాకెజ్‌ ఫుడ్‌ తినడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. మార్కెట్‌లో అనేక రకాల ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

ప్యాక్ చేసిన జ్యూస్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు రకరకాల రసాయనాలు కలుపుతారు. అందువల్ల వీటి వినియోగం పిల్లలకు చాలా హానికరం. మీరు పిల్లలకు ప్యాక్ చేసిన పండ్ల రసాలను అస్సలు ఇవ్వకూడదు. వీటిని తీసుకోవడం వల్ల ఆహార అలెర్జీలు, చర్మ అలెర్జీలు వంటి తీవ్రమైన సమస్యలు ఉంటాయి. ప్యాక్ చేసిన పండ్ల రసం తాగడం ద్వారా మీరు అతిసారం, మలబద్ధకం, జీర్ణక్రియకు సంబంధించిన అనేక ఇతర వ్యాధుల భారిన పడుతారు.

మార్కెట్‌లో లభించే దాదాపు అన్ని ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లలో ఆర్గానిక్, కాడ్మియం, మెర్క్యురీ వంటి రసాయనాలు కలుపుతారు. వీటిని తీసుకోవడం వల్ల పిల్లల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. అందువల్ల ప్యాక్ చేసిన పండ్ల రసాలను తాగడం మానుకోండి. అలాగే ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్‌ను ఎక్కువసేపు నిరంతరం తీసుకోవడం వల్ల మీరు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది. అందులో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీ బరువు పెరుగుతుంది.

Tags:    

Similar News