Health News: ఉదయాన్నే టీకి బదులుగా ఈ పానీయాలు తాగండి.. బెల్లీఫ్యాట్‌ సులువుగా కరుగుతుంది..!

Health News: చాలా మంది ప్రజలు ఉదయం నిద్రలేచిన వెంటనే టీ కోసం ఆరాటపడతారు.

Update: 2023-02-16 01:30 GMT

Health News: ఉదయాన్నే టీకి బదులుగా ఈ పానీయాలు తాగండి.. బెల్లీఫ్యాట్‌ సులువుగా కరుగుతుంది..!

Health News: చాలా మంది ప్రజలు ఉదయం నిద్రలేచిన వెంటనే టీ కోసం ఆరాటపడతారు. దేశంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం ఇదే. ఇందులో చక్కెర ఉంటుంది కాబట్టి బరువు పెరగడానికి కారణమవుతుంది. వాస్తవానికి రోజులో ఎన్ని టీలు తాగుతామో మనకే తెలియదు. ఈ సందర్భంలో శరీరంలోని చక్కెర కొవ్వుగా మారడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు. ఉదయాన్నే టీకి బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు తాగవచ్చు. ఇవి పొట్ట, నడుము దగ్గర ఉండే కొవ్వును వేగంగా కరిగిస్తాయి.

1. బ్లాక్ కాఫీ

మీరు టీ తాగకుండా ఉండలేకపోతే బ్లాక్ కాఫీ రూపంలో ఆరోగ్యకరమైన పానీయాన్ని తాగవచ్చు. ఇది చక్కెరను కలిగి ఉండదు. కానీ కెఫిన్ కారణంగా మీరు రిఫ్రెష్ అనుభూతి చెందుతారు. ఈ పానీయం వల్ల జీవక్రియలు పుంజుకుంటాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

2. కొబ్బరి నీరు

కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. హైడ్రేట్‌గా ఉండటానికి కొబ్బరినీరు తాగుతారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే దాని ఎంజైమ్‌లు జీవక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు.

3. ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ చాలా పోషకమైన పానీయం. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. పొట్ట, నడుము కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. దీనిని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగితే ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. దీంతో మీకు తిండిపై ధ్యాస తగ్గుతుంది.

4. గ్రీన్ టీ

గ్రీన్ టీ ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పానీయంగా చెబుతారు. ఇందులో ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గడానికి రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకోవచ్చు.

5. నిమ్మరసం

నిమ్మరసం క్రమం తప్పకుండా తాగాలి. దీనికి చక్కెర కలపకుండా తీసుకోవాలి. అవసరమైతే నల్ల ఉప్పు కలుపుకోవచ్చు. జీవక్రియను పెంచడానికి ఇది సులభమైన, చౌకైన మార్గం. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Tags:    

Similar News