Women Health: ప్రెగ్నెన్సీ సమయంలో వీటి జోలికి పోవద్దు.. సమస్యలు కొని తెచ్చుకోవద్దు..!

Women Health: అమ్మాయిలు అందంగా, పొడుగ్గా కనిపించడానికి హై హీల్స్‌ వేసుకుంటారు. ఇందులో తప్పు లేదు. కానీ కొన్ని సమయాల్లో వీటిని వేసుకోకూడదు. ఈ విషయం ప్రతి ఒక్క మహిళకు తెలిసి ఉండాలి.

Update: 2024-01-06 16:00 GMT

Women Health: ప్రెగ్నెన్సీ సమయంలో వీటి జోలికి పోవద్దు.. సమస్యలు కొని తెచ్చుకోవద్దు..!

Women Health: అమ్మాయిలు అందంగా, పొడుగ్గా కనిపించడానికి హై హీల్స్‌ వేసుకుంటారు. ఇందులో తప్పు లేదు. కానీ కొన్ని సమయాల్లో వీటిని వేసుకోకూడదు. ఈ విషయం ప్రతి ఒక్క మహిళకు తెలిసి ఉండాలి. లేదంటే జీవితంలో చాలా బాధపడుతారు. హైహీల్స్‌ ధరించే విషయంలో అమ్మాయిలకు వయసు, సమయం చాలా ముఖ్యం. కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో హీల్స్ ధరిస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో హీల్స్‌ ధరించడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు పాలు ఇచ్చే వరకు హీల్స్ ధరించడం మానేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు వేగంగా పెరుగుతుంది. చాలా మంది మహిళల్లో పాదాలలో వాపులు ఏర్పడుతాయి. ఈ పరిస్థితిలో హీల్స్‌ వేసుకుంటే వాపు మరింత పెరుగుతుంది. ఎక్కువ సేపు హీల్స్ వేసుకోవడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి మోకాళ్లలో వస్తుంది. పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు హీల్స్‌ వేసుకొని ఎత్తుకోవడం చేయకూడదు. బిడ్డ నడవడం నేర్చుకునే వరకు తల్లి మడమలను ధరించకుండా ఉండాలి.

గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం స్లిప్‌ అయినా గర్భస్రావం అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. మొదటి త్రైమాసికంలో హీల్స్ ధరించడం మానుకోకున్నా ఆఫీసుకు వెళ్లేటప్పుడు లైట్ హీల్స్ ధరించవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు, మూడు త్రైమాసికాల్లో అధిక బరువు పెరగడం వల్ల హీల్స్ ధరించడం కష్టమవుతుంది. కాబట్టి ఈ సమయంలో సౌకర్యవంతమైన స్లిప్పర్లు, బూట్లు ధరించడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మహిళలు జారి పడితే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News