Health Tips: అల్యూమినియం కవర్స్‌లో ఆహారాన్ని ఎక్కువ సేపు ఉంచవద్దు..!
Health Tips: ఈ రోజుల్లో మార్కెట్‌లో అల్యూమినియం కవర్స్‌ని ఎక్కువగా వాడుతున్నారు.
Health Tips: అల్యూమినియం కవర్స్‌లో ఆహారాన్ని ఎక్కువ సేపు ఉంచవద్దు..!
Health Tips: ఈ రోజుల్లో మార్కెట్‌లో అల్యూమినియం కవర్స్‌ని ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కవర్స్‌లో ఆహారాన్ని ప్యాక్ చేయడం వల్ల చాలా కాలం పాటు తాజాగా, వేడిగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఉంచడం మీ ఆరోగ్యానికి మంచిదేనా అనేది తెలుసుకోవాలి. అయితే అల్యూమినియం కవర్లని ఎలా తయారుచేస్తారు.. వాటిలో ఎంత సమయం ఆహారం ఉండాలి అనే వివరాల గురించి తెలుసుకుందాం.
నిజానికి అల్యూమినియం ఫాయిల్‌లో స్వచ్ఛమైన అల్యూమినియం ఉండదు. ఇందులో మిక్స్‌డ్ మెటల్‌ని ఉపయోగిస్తారు. అల్యూమినియం ఫాయిల్‌ను తయారు చేయడానికి ముందుగా అల్యూమినియం కరిగించి, రోలింగ్ మిల్ అనే ప్రత్యేక రకం యంత్రంలో తయారు చేస్తారు. వేగంగా మారుతున్న జీవనశైలిలో అల్యూమినియం కవర్లని ఎక్కువగా వాడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్యూమినియం కవర్లని ఉపయోగించడం ప్రమాదకరం కాదు. కానీ ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు. అల్యూమినియం కవర్లలో ఆహారాన్ని 4 నుంచి 5 గంటల కంటే ఎక్కువసేపు ఉంచడం హానికరం.
అల్యూమినియం కవర్లలో కొన్ని గంటల పాటు ఆహారాన్ని ఉంచడం ఫర్వాలేదు కానీ ఎక్కువసేపు ఆహారాన్ని ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ పరిస్థితిలో మీకు కావాలంటే మీరు ఆహారాన్ని తాజాగా, వెచ్చగా ఉంచడానికి మస్లిన్ క్లాత్, ఫుడ్ గ్రేడ్ బ్రౌన్ పేపర్ లేదా బటర్ పేపర్‌ని ఉపయోగించవచ్చు. అల్యూమినియం కవర్స్ తేమ, వాసనను లాక్ చేస్తుంది. ఆహారాన్ని తాజాగా ఉంచుతుంది. అయితే ఎక్కువ సేపు ఇలా చేయడం హానికరం.