Dehydration : చలికాలంలో నీళ్లు తక్కువ తాగుతున్నారా? అయితే కిడ్నీలో రాళ్లు గ్యారెంటీ

Dehydration : చాలామందికి నీళ్లు తాగడం అంటేనే ఒక రకమైన బద్ధకం. బిజీ లైఫ్, పని ఒత్తిడిలో పడి గంటల తరబడి మంచి నీళ్లు ముట్టని వారు మన మధ్య చాలామందే ఉన్నారు.

Update: 2026-01-13 08:40 GMT

Dehydration : చలికాలంలో నీళ్లు తక్కువ తాగుతున్నారా? అయితే కిడ్నీలో రాళ్లు గ్యారెంటీ

 Dehydration : చాలామందికి నీళ్లు తాగడం అంటేనే ఒక రకమైన బద్ధకం. బిజీ లైఫ్, పని ఒత్తిడిలో పడి గంటల తరబడి మంచి నీళ్లు ముట్టని వారు మన మధ్య చాలామందే ఉన్నారు. శరీరంలోని కల్మషాలను బయటకు పంపడానికి నీరు ప్రధాన వాహకంగా పనిచేస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రక్తం వడపోత ప్రక్రియ మందగించి, విషతుల్యాలు లోపలే పేరుకుపోతాయి. ఇది మొదట్లో చిన్న సమస్యగా అనిపించినా, కాలక్రమేణా కిడ్నీలలో ఖనిజాలు, లవణాలు పేరుకుపోయి గట్టి స్పటికాలుగా మారుతాయి. అవే మనం చెప్పుకునే కిడ్నీ రాళ్లు.

శరీరానికి సరిపడా నీరు అందనప్పుడు మూత్రం ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల మూత్రం గాఢత పెరిగి, అందులోని కాల్షియం, ఆక్సలేట్ వంటి లవణాలు బయటకు పోలేక కిడ్నీలలోనే ఆగిపోతాయి. ఇవి క్రమంగా ఒకదానికొకటి అంటుకుని రాళ్లలా తయారవుతాయి. ముఖ్యంగా ఉప్పు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారు, ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకునేవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో చెమట పట్టదు కాబట్టి శరీరానికి నీరు అవసరం లేదని అనుకోవడం అతిపెద్ద పొరపాటని ఆయన హెచ్చరిస్తున్నారు.

శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు మన దేహం కొన్ని సంకేతాలను ఇస్తుంది. నోరు ఆరిపోవడం, తలనొప్పి, నీరసం రావడం వంటివి ప్రాథమిక లక్షణాలు. మూత్రం ముదురు పసుపు రంగులో వస్తుందంటే మీరు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారని అర్థం. అలాగే చర్మం పొడిబారడం, మలబద్ధకం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు కూడా నీటి కొరత వల్లనే వస్తాయి. వీటిని విస్మరిస్తే వెన్నునొప్పి, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి మొదలవుతాయి. ఇవి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనడానికి ప్రధాన సంకేతాలు.

కిడ్నీ రాళ్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. దాహం వేసే వరకు ఆగకుండా క్రమ పద్ధతిలో నీళ్లు తాగుతూ ఉండాలి. జంక్ ఫుడ్, అధిక ఉప్పు ఉన్న పదార్థాలను తగ్గించాలి. చలికాలంలో నీరు చల్లగా ఉండి తాగలేకపోతే, గోరువెచ్చని నీటిని తీసుకోవడం ఉత్తమం. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Tags:    

Similar News