Smoking : పొగ తాగడం మానేస్తే షుగర్ ప్రమాదం తగ్గుతుందా? సైన్స్ చెప్పిన నిజాలు ఇవే!

మధుమేహం అనేది చాలామందిని వేధిస్తున్న ఒక ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిలో శరీరానికి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు, లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కంటి చూపు తగ్గడం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.

Update: 2025-09-19 05:30 GMT

Smoking : పొగ తాగడం మానేస్తే షుగర్ ప్రమాదం తగ్గుతుందా? సైన్స్ చెప్పిన నిజాలు ఇవే!

Smoking : మధుమేహం అనేది చాలామందిని వేధిస్తున్న ఒక ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిలో శరీరానికి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు, లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కంటి చూపు తగ్గడం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. టైప్ 2 మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా 95 శాతం కేసులకు కారణమవుతోంది. దీనికి ప్రధానంగా జీవనశైలి అలవాట్లే కారణం.

ధూమపానం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎలా పెరుగుతుందో డాక్టర్లు వివరించారు. "పొగతాగని వారితో పోలిస్తే, ధూమపానం చేసేవారిలో టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం 30 నుంచి 40 శాతం ఎక్కువ" అని ఆయన అన్నారు. సిగరెట్‌లో ఉండే రసాయనాలు శరీర కణాలను దెబ్బతీసి, ఇన్సులిన్‌ను సమర్థవంతంగా పనిచేయనివ్వకుండా అడ్డుకుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ధూమపానం వల్ల మధుమేహం ఉన్నవారికి సమస్యలు మరింత పెరుగుతాయని డాక్టర్లు హెచ్చరించారు. పొగతాగే మధుమేహ రోగులకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, కిడ్నీ దెబ్బతినడం, కంటిచూపు తగ్గడం, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. దీనివల్ల శరీరంలోని కొన్ని భాగాలు కోల్పోవాల్సి వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆయన తెలిపారు.

ధూమపానం మానేస్తే కలిగే ప్రయోజనాలు

ధూమపానం మానేస్తే మధుమేహం పూర్తిగా నయం కానప్పటికీ, ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. అవేంటంటే రక్తంలో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇన్సులిన్ సంవేదన పెరుగుతుంది. సర్జరీల తర్వాత త్వరగా కోలుకోవచ్చు. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

పరిశోధనల ప్రకారం, ధూమపానం మానేసిన కేవలం 8 వారాల్లోనే ఇన్సులిన్ మరింత ప్రభావవంతంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. ధూమపానం మానేయడం వల్ల మధుమేహం పూర్తిగా నయం కాకపోయినా, దాని వల్ల వచ్చే ప్రాణాంతక సమస్యలను నివారించడంలో ఇది చాలా సహాయపడుతుంది.

Tags:    

Similar News