Raisins: ఎండుద్రాక్ష తినడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుందా..?

Raisins: డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్‌తో బాధపడేవారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, మందులు తీసుకోవడం చాలా ముఖ్యం.

Update: 2025-05-31 08:30 GMT

Raisins: ఎండుద్రాక్ష తినడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుందా..?

Raisins: డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్‌తో బాధపడేవారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైద్యుల ద్వారా ఏమి తినాలో, ఏమి తినకూడదో వివరంగా తెలుసుకోవాలి. అయితే, డయాబెటిస్‌తో బాధపడేవారు ఎండుద్రాక్ష తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనితో పాటు ఎముకలు కూడా బలపడతాయి. ఎండుద్రాక్ష మన జీర్ణక్రియకు, మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఎండుద్రాక్షలు ఆరోగ్యకరమైన వ్యక్తికి ఎంత మంచివో, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా అంతే మంచివని నిపుణులు చెబుతున్నారు.

అయితే, వాటిని తిన్న తర్వాత చక్కెర స్థాయిని తనిఖీ చేసుకోవాలని అంటున్నారు. కానీ, వాటిని మితంగా తినాలని సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితిలోనూ వాటిని ఎక్కువగా తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, వాటిని ఎక్కువ మోతాదులో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగే అవకాశం ఉందని అంటున్నారు. రెగ్యులర్‌గా కాకుండా, రేర్‌గా వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News