Air Conditioner Side Effects: ఏసీ గదిలో ఎక్కువ సేపు గడుపుతున్నారా.. ఈ వ్యాధులకు రెడీగా ఉండండి..!

Air Conditioner Side Effects: ఎండలు ముదరడంతో వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారిపో యింది.

Update: 2024-04-05 07:59 GMT

Air Conditioner Side Effects: ఏసీ గదిలో ఎక్కువ సేపు గడుపుతున్నారా.. ఈ వ్యాధులకు రెడీగా ఉండండి..!

Air Conditioner Side Effects: ఎండలు ముదరడంతో వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారిపో యింది. దీంతో చాలామంది చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద గడుపుతున్నారు. అయితే కూలర్లు, ఫ్యాన్లు అంటే పర్వాలేదు కానీ ఏసీ గదిలో చాలా సమయం గడిపేవారికి చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.హైడ్రేటెడ్‌గా ఉండటం, హీట్‌స్ట్రోక్‌ను నివారిం చడం ఎంత ముఖ్యమో ఇంటి లోపల ఉన్నప్పుడు కూడా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవా లి. ఈ రోజు ఏసీ గదిలో గంటల తరబడి ఉండడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

ఎయిర్ కండీషనర్‌ను నడపడం వల్ల మీరు మండుతున్న వేడి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మీ చర్మం, కళ్లు, ఇతర శరీర భాగాలను ప్రభావితం చేస్తుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఏసీ వాడకం వల్ల అంటు వ్యాధుల ముప్పు బాగా పెరుగుతుందని చెబుతున్నారు. దీనితో పాటు ఏసీని ఉపయోగిస్తే దాని శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

1.డీహైడ్రేషన్ బారిన పడుతారు

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. గది ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి ఏసీ గదిలోని తేమ మొత్తాన్ని గ్రహిస్తుంది. ఈ గదిలో ఎక్కువ సేపు ఉండడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. నిజానికి మీరు ఏసీ గదిలో ఉన్నప్పుడు మీకు తక్కువ దాహం వేస్తుంది. దీని కారణంగా శరీరం తేమను కోల్పోతుంది.

2. కళ్లు, చర్మానికి హాని

ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల చర్మం, కళ్లు తేమగా మారతాయి. దీని కారణంగా చర్మం

పొడిబారుతుంది. అలాగే ఏసీ గదిలో ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లు పొడిబారే సమస్య పెరుగుతుంది.

3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

మీరు ఆస్తమా పేషెంట్ అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. మీరు ఏసీ గదిలో ఎక్కువ సమయం గడపకూడదు.

Tags:    

Similar News