Rats Problem: ఎలుకల బెడద ఎక్కువగా ఉందా.. ఈ చిట్కాలు పాటించండి..!

Rats Problem: ఎలుకల సమస్య లేని ఇల్లు ఉండదు.

Update: 2022-10-06 15:30 GMT

Rats Problem: ఎలుకల బెడద ఎక్కువగా ఉందా.. ఈ చిట్కాలు పాటించండి..!

Rats Problem: ఎలుకల సమస్య లేని ఇల్లు ఉండదు. కానీ ఇవి అవసరమైన వస్తువులని పాడుచేస్తుంటే మాత్రం ఎవ్వరు తట్టుకోలేరు. వాటిని తరిమికొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఎలుకల బెడద తగ్గకుంటే మీరు కొన్ని ఎలుకలని పారదోలే చిట్కాలని తెలుసుకోవాలి. వీటిని పాటిస్తే ఎలుకలు మీ ఇంటి నుంచి శాశ్వతంగా దూరమవుతాయి.

వెల్లుల్లి వాడకం

వెల్లుల్లి సాధారణంగా అన్ని ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. దీనిని ఉపయోగించి ఇంట్లో నుంచి ఎలుకలని తరిమేయవచ్చు. ఇందుకోసం వెల్లుల్లిని సన్నగా తరిగి కొన్ని నీటిలో కలపాలి. తరువాత ఆ నీటిని ఎలుకలు ఉండే ప్రదేశాలలో చల్లాలి. అంతేకాదు వెల్లుల్లిని కట్ చేసి ఎలుకలు ఉండే ప్రదేశాలలో పెట్టవచ్చు. ఎలుకలు దాని వాసన కారణంగా ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

ఉల్లిపాయలు

ఇంట్లో నుంచి ఎలుకలను తరిమికొట్టడానికి ఉల్లిపాయని కూడా ఒక ఆయుధంగా వాడవచ్చు. నిజానికి ఉల్లిపాయల నుంచి వెలువడే వాసన వల్ల ఎలుకలు చాలా చిరాకు పడతాయి. ఇది వాటికి మైకం కలిగించే టాక్సిన్‌గా పనిచేస్తాయి. అందుకే ఉల్లిని కోసి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో పెట్టాలి. ఉల్లివాసనకి ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

లవంగం నూనె

మీరు లవంగం నూనెను ఉపయోగించడం ద్వారా ఇంట్లో ఎలుకలు లేకుండా చేయవచ్చు. దీని కోసం ఒక క్లాత్ తీసుకొని దానిపై లవంగం నూనెను చిలకరించాలి. తరువాత ఆ గుడ్డ ముక్కలను కత్తిరించి ఎలుకలు తిరిగే ప్రదేశాలలో వేయాలి. దీని వాసన కారణంగా ఎలుకలు మీ ఇంటిని వదిలివేస్తాయి.

పుదీన నూనె

పుదీన వాసన ఎలుకలు అస్సలు సహించవు. ఇది వాటిని చాలా ఇబ్బందిపెడుతుంది. ఇందుకోసం కొన్ని దూది ముక్కలను తీసుకొని వాటిపై పుదీన నూనె రాసి ఎలుకలు సంచరించే ప్రదేశాలలో ఉంచాలి. కొంత సేపటికి అక్కడ నుంచి ఎలుకలు పరిగెత్తడం చూస్తారు.

Tags:    

Similar News