Health News: అన్నం తింటే బరువు పెరుగుతారని భయమా..!

Health News: అన్నం తింటే బరువు పెరుగుతారని భయమా..!

Update: 2022-03-21 08:30 GMT

Health News: అన్నం తింటే బరువు పెరుగుతారని భయమా..!

Health News: అన్నం తింటే బరువు పెరుగుతారని, లావుగా ఉంటారని చాలామంది భావిస్తారు. కానీ ఇవన్ని అపోహలే. వాస్తవానికి రాత్రిపూట అన్నం తింటే స్థూలకాయం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే వైట్ రైస్ తినడానికి బదులు బ్రౌన్ రైస్ తింటే మంచిది. అన్నం తినడానికి సంబంధించిన అన్ని రకాల అపోహలు దాని వెనుక ఉన్న వాస్తవాలని తెలుసుకుందాం. ఇప్పటికీ అన్నం తింటే బరువు పెరుగుతారని చాలామంది తినడం మానేస్తారు. కానీ అలాంటి వారికి అన్నం త్వరగా జీర్ణం అవుతుంది. మీరు కిచ్డీ, పప్పు అన్నం తింటుంటే అందులో అమైనో ఆమ్లాలు ఉంటాయి. మంచి ప్రోటీన్, మంచి కొవ్వు ఉంటాయి. ఇవి బరువుని తగ్గిస్తాయి కానీ పెంచవు.

ఇది కాకుండా బియ్యంలో గ్లూటెన్ ఉంటుందని అందరు భయపడుతారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే తెలుపు, గోధుమ బియ్యంలో గ్లూటెన్ ఉండదు. అదే సమయంలో వైట్ రైస్ ఊబకాయాన్ని పెంచుతుందని అంటారు. అందుకే బ్రౌన్ రైస్ తినాలి. అయితే బ్రౌన్ రైస్ బరువు తగ్గించదు. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది జింక్ ఉండదు. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే మనకు జింక్ అవసరం.

మీరు వెరైటీ రైస్ తింటే చింతించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యాన్ని, బరువును కాపాడుకోవాలంటే కాంబినేషన్ ప్రకారం అన్నం తినాలి. అప్పుడు అస్సలు లావుగా ఉండరు. బరువు కూడా పెరగరు. ఇండియాలో దాదాపు చాలామంది ప్రతిరోజు మూడుపూటల అన్నమే తింటారు. అయితే ఇందులో కొంతమంది శారీరక శ్రమ చేస్తారు. మరికొంతమంది ఉద్యోగాలు చేస్తారు. అయితే మొదటివారికి ఎలాంటి సమస్యలు ఉండవు. శారీరక శ్రమలేనివారు కొంచెం తక్కువగా తింటే సరిపోతుంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News