Hair Fall: జుట్టు ఎక్కువగా రాలితే ఈ టెస్ట్‌ చేయించుకోండి.. లేదంటే బట్టతల వచ్చే ప్రమాదం..!

* ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల జుట్టు రాలుతోంది.

Update: 2022-12-17 03:59 GMT

జుట్టు ఎక్కువగా రాలితే ఈ టెస్ట్‌ చేయించుకోండి.. లేదంటే బట్టతల వచ్చే ప్రమాదం

Hair Fall: ఈ రోజుల్లో జుట్టు రాలడం సర్వసాధారణంగా మారింది. స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొందరు ఈ హెయిర్ ఫాల్‌ను హోం రెమెడీస్‌తో ఆపడానికి ప్రయత్నిస్తే మరికొందరు కాస్మెటిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పద్ధతులు జుట్టు రాలడాన్ని ఆపలేవు. హెయిర్‌ ఫాల్‌ వల్ల ప్రజలు క్రమంగా బట్టతల బారిన పడుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల జుట్టు రాలుతోంది. దీనికోసం కొన్ని పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు చేసినప్పుడు అసలు సమస్య బయట పడుతుంది.

థైరాయిడ్ పరీక్ష

జుట్టు రాలే సమస్యలో T3, T4, TSH ఉంటాయి. థైరాయిడ్‌ వల్ల జుట్టు రాలుతుంది. అందుకే హార్మోన్ల స్థాయిని చెక్ చేసుకోవాలి. ఈ పరీక్షలు థైరాయిడ్, జుట్టు రాలడాన్ని గుర్తించడంలో సహాయపడతాయి.

హార్మోన్ పరీక్ష

జుట్టు రాలే సమస్యలో వైద్యులు తరచుగా హార్మోన్ పరీక్షలు చేస్తారు. జుట్టు రాలడానికి అనేక హార్మోన్ల లోపం కారణం అవుతుంది. అవి ప్రోలాక్టిన్, టెస్టోస్టెరాన్, DHEA, లూటినైజింగ్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వంటి టెస్టులు చేయించాలి.

స్కాల్ప్ బయాప్సీ

ఈ పరీక్షలో మీ స్కాల్ప్ నుంచి ఒక చిన్న భాగం తీసుకొని మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తారు. ఈ పరీక్ష మీ జుట్టు రాలడానికి కారణాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

సీర, ఐరన్‌, సీరం ఫెర్రిటిన్ టెస్టులు

సీరం, ఐరన్‌, సీరం ఫెర్రిటిన్ వంటి భాగాల ఖచ్చితమైన స్థాయిని కనుగొనడంలో ఈ పరీక్షలు సహాయపడతాయి. శరీరంలో వాటి స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు అది జుట్టు రాలడానికి కారణమవుతుంది.

CBC పరీక్ష

ఈ పరీక్ష మొత్తం శరీర రక్త స్థాయి, రక్త గణనను తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది . దీన్ని బట్టి శరీరంలో రక్తం లోపించిందా లేదా అనేది తెలుస్తుంది.

Tags:    

Similar News