Women: మహిళలు ఆ సమయంలో పెయిన్‌ కిల్లర్స్‌ వద్దు.. ఎందుకంటే..?

Women: మహిళల్లో రుతుక్రమం అనేది దాదాపు 12 సంవత్సరాల వయస్సు నుంచే ప్రారంభమవుతుంది.

Update: 2022-02-28 06:00 GMT

Women: మహిళలు ఆ సమయంలో పెయిన్‌ కిల్లర్స్‌ వద్దు.. ఎందుకంటే..?

Women: మహిళల్లో రుతుక్రమం అనేది దాదాపు 12 సంవత్సరాల వయస్సు నుంచే ప్రారంభమవుతుంది. దాదాపుగా 50 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతోంది. ఇది ప్రతి నెల 3 నుంచి 7 రోజులు జరిగే ప్రక్రియ. ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి మహిళ పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంది. ఈ పరిస్థితిలో కడుపు నొప్పిని నివారించడానికి పెయిన్‌ కిల్లర్స్‌ని వాడుతున్నారు. ఇది వారికి భవిష్యత్‌లో హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మహిళలు పెయిన్‌ కిల్లర్స్‌కి దూరంగా ఉంటే మంచిది. కానీ వీటికంటే కొన్ని ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

రెండు చిన్న గిన్నెలు తీసుకోండి. ఒకదానిలో నల్ల ఎండుద్రాక్ష (4 లేదా 5) మరొకదానిలో కుంకుమపువ్వు (1-2) వేయండి. ఉదయం వాటిని తినండి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడానికి ఐరన్ లోపాన్ని భర్తీ చేయడానికి సహాయపడుతాయి. పీరియడ్స్ సమయంలో మెంతులు తీసుకుంటే మంచిది. 12 గంటల ముందు మెంతులు నీటిలో నానబెట్టాలి ఆ తర్వాత నీటి నుంచి మెంతులు వడపోసి మిగిలిన నీటిని తాగాలి.

నీరు తాగడం వల్ల మీ శరీరం హైడ్రేట్ ఉంటుంది. ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడానికి సులభమైన మార్గం ఎక్కువ నీరు తాగడమే. ఇది కాకుండా టీ లేదా కాఫీ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎసిడిటీ, అజీర్ణం, వెన్నునొప్పి, తలనొప్పి, రొమ్ములో భారం, బలహీనత వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి నెలా జరిగే ఈ రక్తస్రావం కూడా మిమ్మల్ని బలహీనపరుస్తుంది. మీ పీరియడ్స్ చాలా హెవీగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవడం మంచిది.

Tags:    

Similar News