మైక్రోవేవ్‌లో ఈ ఆహార పదార్థాలను వేడి చేస్తున్నారా.. ప్రమాదం ఎలాగంటే..?

Microwave: ప్రస్తుత రోజుల్లో అందరి వంటిల్లో మైక్రోవేవ్‌లు ఉంటున్నాయి. వీటి ద్వారా ఆహారాన్ని సులువుగా వేడి చేసి తింటున్నారు.

Update: 2021-12-18 09:25 GMT

మైక్రోవేవ్‌లో ఈ ఆహార పదార్థాలను వేడి చేస్తున్నారా.. ప్రమాదం ఎలాగంటే..?(ఫైల్-ఫోటో)

Microwave: టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో అందరి వంటిల్లో మైక్రోవేవ్‌లు ఉంటున్నాయి. వీటి ద్వారా ఆహారాన్ని సులువుగా వేడి చేసి తింటున్నారు. కానీ ఇది మంచిదా చెడ్డదా అని ఎవ్వరూ ఆలోచించడం లేదు.

ఇంట్లోనే కాదు, వర్క్‌ప్లేస్‌లోని క్యాంటీన్‌లో కూడా మైక్రోవేవ్ ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగిస్తారు. బేకరీలలో కూడా వీటిని ఎక్కువగా వాడుతారు. ఇది పని సులువుగా చేస్తున్న మాట వాస్తవమే కానీ అంతే రీతిలో నష్టాలను కూడా కలిగిస్తుంది.

కొన్ని ఆహారాలు మైక్రోవేవ్‌లో వేడి చేయడం వల్ల చాలా దెబ్బతింటున్నాయి. అంతేకాదు అలాంటివి తినడం వల్ల అనారోగ్యానికి గురికావల్సి ఉంటుంది. మరికొన్ని పదార్థాలు టాక్సిన్‌గా మారుతున్నాయి. అందుకే ఇది కొంచెం ప్రమాదకరమైనదే. మీరు మైక్రోవేవ్‌లో పుట్టగొడుగులను వేడి చేస్తే అందులో ఉండే పోషకాలు నాశనమవుతాయి.

మీరు వాటివల్ల ఎటువంటి ప్రయోజనం పొందలేరు. అంతేకాదు అలాగే తింటే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అన్నం చాలా సార్లు ప్రజలు మైక్రోవేవ్‌లో వేడి చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇలాంటి అన్నం తింటే వాంతులు, విరేచనాలు, జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.

మైక్రోవేవ్‌లో చికెన్‌ను వేడి చేయడం వల్ల దాని ప్రొటీన్ నిర్మాణం మారుతుంది. ఆ చికెన్ తినడం వల్ల మీ జీర్ణక్రియను పాడవుతుంది. మైక్రోవేవ్‌లో ఏ రకమైన నూనెను వేడి చేయవద్దు. దీని కారణంగా నూనెలోని మంచి కొవ్వు చెడు కొవ్వుగా మారుతుంది. ఆ నూనె మీ ఆరోగ్యానికి హానికరం అవుతుంది.

కాబట్టి ఎప్పుడూ అలాంటి తప్పు చేయవద్దు. మైక్రోవేవ్‌లో గుడ్లు ఉడకబెట్టినప్పుడు దాని లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో గుడ్డు పగిలిపోతుంది. అందుకే ఇలాంటి ఆహారాలను ఎప్పుడు మైక్రోవేవ్‌లో వేడి చేసి తినకూడదు. ఎల్లప్పుడు సహజంగా చేసే వంటకాలు ఆరోగ్యానికి చాలా మంచిది.

Tags:    

Similar News