Health Tips: వారికి పాదాలలో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా..!

Health Tips: వారికి పాదాలలో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా..!

Update: 2022-03-22 09:00 GMT

Health Tips: వారికి పాదాలలో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా..!

Health Tips: డయాబెటీస్ పేషెంట్లు తరచూ పాదాల నొప్పులతో బాధపడుతుంటారు. కానీ ఆ నొప్పులకి చికిత్స చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేయకూడదు. లేదంటే ఈ సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి రక్తంలో చక్కెర నియంత్రణలో లేనప్పుడు రక్తాన్ని అందించే కేశనాళికలు దెబ్బతింటాయి. దీంతో పాదాలలో నొప్పులు ఏర్పడుతాయి. అంతేకాదు కండరాల బలహీనత, మంటలు, నొప్పులు మొదలైన లక్షణాలు కూడా ఉంటాయి. శరీరానికి సరైన విటమిన్లు అందకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కారణంగా కూడా డయాబెటిస్ రోగులలో ఈ నొప్పులు వస్తాయి.

మధుమేహాన్ని నియంత్రించడానికి ఆహారంలో తృణధాన్యాలు చేర్చాలి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. పాల ఉత్పత్తులకి దూరంగా ఉండాలి. కాళ్ల నొప్పులు ఉంటే విటమిన్ డి, విటమిన్ బి 12 తీసుకోవాలి. నరాలు దెబ్బతినకుండా ఉండాలంటే విటమిన్ బి12 తీసుకోవడం అవసరం. నరాల బలహీనతకి కూడా ఈ విటమిన్ పనిచేస్తుంది. అంతే కాకుండా ఎముకల బలానికి విటమిన్ డి తీసుకోవాలి. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ద్రావణాన్ని సిద్ధం చేయాలి. అందులో మీ పాదాలను ముంచి కొద్దిసేపు ఉండాలి. అప్పుడు మంచి ఉపశమనం ఉంటుంది. పాదాల నొప్పి తగ్గుతుంది. ఉప్పు నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల పాదాలలో వాపు సమస్య కూడా తొలగిపోతుంది.

వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం జీర్ణం కావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో డయాబెటిక్ రోగులు ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఆహారాన్ని తీసుకోవాలి. నేరేడు పండ్లతో పాటు దాని విత్తనాలు కూడా షుగర్ రోగులకు చాలా మేలు చేస్తాయి. చక్కెరను నియంత్రించడానికి, జామ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వేసవిలో, ఫైబర్ పుష్కలంగా ఉండే జామ, జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమైతే చక్కెర అదుపులో ఉంటుంది. ఇంకా బొప్పాయి, యాపిల్ కూడా డైట్‌లో చేర్చుకోవాలి.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News