Health Tips: ఈ పోషకాల లోపం ఉంటే తొందరగా అలసిపోతారు..!

Health Tips: ఈ పోషకాల లోపం ఉంటే తొందరగా అలసిపోతారు..!

Update: 2022-09-11 16:30 GMT

Health Tips: ఈ పోషకాల లోపం ఉంటే తొందరగా అలసిపోతారు..!

Health Tips: శరీరానికి ప్రతిరోజూ అనేక పోషకాలు అవసరం. ఇవి సాధారణంగా ఆహారం ద్వారా లభిస్తాయి. ఇందులో ఒక పోషకాహారం లోపిస్తే బలహీనంగా మారుతారు. తరచుగా అలసటను ఎదుర్కోవలసి ఉంటుంది. భారతదేశంలో చాలా మంది విటమిన్స్‌ లోపంతో బాధపడుతున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులు అంతర్గతంగా బలహీనంగా ఉంటారు. శరీరానికి విటమిన్ల అవసరం చాలా ఉంటుంది.

ప్రతి విటమిన్ దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుంది. వీటి లోపం కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది. ఎముకలు కుంచించుకుపోతాయి. కండరాలు నొప్పిని అనుభవిస్తాయి. చర్మం పొడిగా, వదులుగా మారుతుంది. అలాగే తల వెంట్రుకలు బలహీనంగా మారి ఊడిపోతాయి. ఏ వ్యక్తి అయినా విటమిన్ లోపం బారిన పడే అవకాశం ఉన్నప్పటికీ వృద్ధులు, గర్భిణీలు దీనికి ఎక్కువగా గురవుతారు. యువకులు ఆరోగ్యకరమైన ఆహారాలకు బదులుగా చెడు ఆహారాలు తినడం ప్రారంభిస్తే వారిలో విటమిన్లు, పోషకాల లోపం ఏర్పడుతుంది.

మీ శరీరంలో పోషకాల కొరత ఉంటే అధిగమించడానికి మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు . వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ల లోపం తొలగిపోవడమే కాకుండా క్రోమియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి అందుతాయి. మల్టీవిటమిన్‌లను వేసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది. ఇది మీ శరీరం నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాళ్లు, శరీరం, చేతుల్లో నొప్పి ఉంటే మల్టీవిటమిన్ మీకు దివ్యౌషధం అని చెప్పవచ్చు.

Tags:    

Similar News