Dangerous Food Combination: బొప్పాయితో కలిపి ఇవి తీసుకుంటున్నారా.. విషాన్ని తిన్నట్లే.. అవేంటో తెలుసా?

Dangerous Combination With Papaya: బొప్పాయి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే మాత్రం విషపూరితంగా మారుతుంది. ఏ పదార్థాలతో తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Update: 2023-04-22 15:30 GMT

Dangerous Food Combination: బొప్పాయితో కలిపి ఇవి తీసుకుంటున్నారా.. విషాన్ని తిన్నట్లే.. అవేంటో తెలుసా?

Dangerous Combination With Papaya: మీరు బరువు తగ్గాలన్నా, జీర్ణక్రియను మెరుగుపరచుకోవాలన్నా లేదా మధుమేహాన్ని నియంత్రించుకోవాలన్నా బొప్పాయి కీలకంగా పనిచేస్తుంది. బొప్పాయిలో డైటరీ ఫైబర్, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు సి, ఎ, ఇ, బి, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఆల్ఫా, బీటా కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది కణాల పునరుత్పత్తికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

చాలా మంది ఫిట్‌నెస్ నిపుణులు బొప్పాయిని రోజూ తినాలని సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ 60 ఉంటుంది. డయాబెటిక్ రోగులకు కూడా బొప్పాయి హానికరం కాదు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది అలెర్జీలతో పోరాడటానికి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా, బొప్పాయిని అధిక పరిమాణంలో తీసుకోకూడదు. ఇది హానికరంగా మారుతుంది. ఏ పదార్థాలతో తినకూడదో తెలుసుకుందాం..

నిమ్మకాయతో తినవద్దు..

సలాడ్‌లో బొప్పాయిని ఉపయోగిస్తే, అందులో నిమ్మరసాన్ని ఎప్పుడూ కలపకూడదు. దీనివల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. నిమ్మకాయ, బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల విషపూరితం అవుతుంది. ఇది రక్తహీనత, హిమోగ్లోబిన్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తుంది. అందుకే ఈ కాంబినేషన్‌లో బొప్పాయి తినకూడదని సూచిస్తున్నారు.

ఈ పండ్లతో అస్సలు తీసుకోకూడదు..

బొప్పాయి తిన్న తర్వాత నారింజ, కివీ, టొమాటో వంటి పుల్లని పండ్లతో అస్సలు తినకూడదు.

పెరుగు, బొప్పాయితో..

పెరుగు, బొప్పాయిని ఎప్పుడూ కలిపి తినకూడదు. ఈ రెండు ప్రభావాలు భిన్నంగా ఉంటాయి. అందుకే వీటిని కలిపి తినడం శరీరానికి హానికరంగా మారుతుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

బొప్పాయి తీసుకోవడం ద్వారా శరీరం సంపూర్ణ పోషణను పొందుతుంది. కానీ, ఈ పండును అధిక పరిమాణంలో తినడం హానికరం. ఇందులో ఉండే పాపిన్ అనే ఎంజైమ్ వాపు, తల తిరగడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి అలర్జీలను కలిగిస్తుంది. ఈ అలెర్జీ ఉన్నవారు బొప్పాయిని తినకూడదు.

Tags:    

Similar News